BASARA RGUKT | బాస‌ర ఆర్జీయూకేటీ.. ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా విడుద‌ల‌.. 8 నుంచి కౌన్సెలింగ్

Basara RGUKT | బాస‌ర ఆర్జీయూకేటీలో ప్ర‌వేశాల‌కు సంబంధించి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా విడుద‌లైంది. ఓపెన్ కేట‌గిరిలో ఐదుగురు విద్యార్థులు, ఈడ‌బ్ల్యూఎస్ కేట‌గిరిలో 184 మంది, బీసీ – ఏ కేట‌గిరిలో 139, బీసీ – బీ కేట‌గిరిలో 338, బీసీ – సీ కేట‌గిరిలో 14, బీసీ – డీ కేట‌గిరిలో 283, బీసీ -ఈ కేట‌గిరిలో 65, ఎస్సీ కేట‌గిరిలో 229, ఎస్టీ కేట‌గిరిలో 147 మంది ఎంపిక‌య్యారు. వీరిలో 976 మంది బాలిక‌లు, 428 మంది బాలురు ఉన్నారు. మొత్తం 1404 సీట్ల‌కు ఎంపిక ప్ర‌క్రియ పూర్త‌యింది.

అత్య‌ధికంగా సిద్దిపేట జిల్లా నుంచి 330 మంది, నిజామాబాద్ నుంచి 157, సంగారెడ్డి జిల్లా నుంచి 132 మంది ఎంపిక కాగా, అత్య‌ల్పంగా వ‌న‌ప‌ర్తి, జోగులాంబ గ‌ద్వాల జిల్లాల నుంచి ఒక్కొక్క‌రి చొప్పున ఎంపిక‌య్యారు.

తొలి జాబితాలో సీట్లు పొందిన విద్యార్థుల‌కు ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వ‌ర‌కు కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. సీరియ‌ల్ నంబ‌ర్ 1 నుంచి 500 వ‌ర‌కు 8వ తేదీన‌, 501 నుంచి 1000 వ‌ర‌కు 9వ తేదీన‌, 1001 నుంచి 1404 వ‌రకు 10వ తేదీన కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు యూనివ‌ర్సిటీ అధికారులు వెల్ల‌డించారు. త‌దిత‌ర వివ‌రాలు, జాబితా కోసం www.rgukt.ac.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.

2024-07-03T12:55:19Z dg43tfdfdgfd