BEAUTY: నిర్మాతగా దూసుకుపోతున్న ప్రభాస్ డైరెక్టర్.. మారుతీ టీం బ్యూటీ సినిమా ప్రారంభం

The Raja Saab: ఈ రోజుల్లో, బస్ స్టాప్ లాంటి చిన్న బడ్జెట్ సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన దర్శకుడు మారుతి. ఆ తరువాత కూడా ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో వచ్చిన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. నానికి భలే భలే మగాడివోయ్ శర్వానంద్ కి మహానుభావుడు లాంటి మంచి విజయాలను అందించారు దర్శకుడు మారుతి.

ఈ క్రమంలో ఇప్పుడు ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ ని చూడబోతున్నామని రెబల్ స్టార్ అభిమానులు తెగ నమ్మకంతో ఉన్నారు. ఈ క్రమంలో ఈ చిత్రంపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే మారుతి ఇప్పుడు దర్శకునిగానే కాకుండా నిర్మాతగా కూడా త్వరలోనే మంచి విజయం సాధించడానికి సిద్ధమైపోయారు.

డైరెక్టర్ మారుతి టీమ్ ప్రోడక్ట్, వానరా సెల్యూలాయిడ్ సంయుక్త నిర్మాణంలో రావు రమేష్ ప్రధాన పాత్రలో బ్యూటీ అనే సినిమా రానుంది. అంకిత్ కొయ్య, విశాఖ ధిమన్ హీరో హీరోయిన్లుగా బాల సుబ్రహ్మణ్యమ్ దర్శకత్వంలో ఎ.విజయ్ పాల్ రెడ్డి నిర్మాతగా ప్రకాష్ రౌతు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ మొదలయ్యింది.

ఏప్రిల్ 22వ తేదీన హైదరాబాదులోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సినిమాకు దర్శకుడు మారుతి క్లాప్ కొట్టగా, మరో దర్శకుడు బుచ్చిబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు వీర శంకర్, సుబ్బు మంగాదేవి, డార్లింగ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. 

లవ్ అండ్ ఫ్యామిలీ  ఎమోషనల్ గా తెరకెక్కబోతున్న బ్యూటీ చిత్రం మే రెండు నుండి హైదరాబాద్ పరిసర పాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుందని నిర్మాతలు తెలిపాడు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సిద్ధం మనోహర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఈ చిత్రానికి ఎడిటర్ గా వర్క్ చేస్తున్న ఈ సినిమాకు  సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్.

Also Read: Revanth Reddy: ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి: రేవంత్‌ హెచ్చరిక

Also Read: Harish Rao: రేవంత్‌ రెడ్డికి ఏడుపాయల దుర్గమ్మ ఉసురు తగులుతుంది: హరీశ్‌ రావు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-04-23T01:45:06Z dg43tfdfdgfd