BIGG BOSS 8 TELUGU: ‘బిగ్ బాస్’ సీజన్ 8లో ఆ లేడీ కంటెస్టెంట్స్ - ఇక రచ్చ మామూలుగా ఉండదు!

Bigg Boss Season 8 Telugu Contestants: బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ప్రారంభం అయ్యేవరకు అసలు దాని గురించి ఎలాంటి లీక్స్ బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు మేకర్స్. కానీ సోషల్ మీడియాలో బిగ్ బాస్ విశ్లేషకులు యాక్టివ్‌గా ఉండడంతో వారి నుంచి ఏదో ఒక లీక్ బయటికి వస్తూనే ఉంటుంది. అలా ఇప్పటికే తెలుగులో అప్‌కమింగ్ బిగ్ బాస్ సీజన్ 8 గురించి పలు వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్స్ వీరే అంటూ ఎవరి ప్రణాళికలను వారు సిద్ధం చేస్తున్నారు. అలా సోషల్ మీడియాలో వైరల్ అయిన 4 మహిళలు ఈసారి బిగ్ బాస్‌లో కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టనున్నారని సమాచారం.

అమృత ప్రణయ్

బిగ్ బాస్‌లో కంటెస్టెంట్స్‌గా రావడానికి సెలబ్రిటీలు కావాల్సిన అవసరం లేదు. వారి పర్సనల్ లైఫ్‌లో కాంట్రవర్సీలు ఉన్నా చాలు.. అలా కాంట్రవర్షియల్ లైఫ్‌తో చాలామందికి పరిచయమయ్యింది అమృత ప్రణయ్. వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో తన తండ్రే స్వయంగా తన భర్తను హత్య చేయించాడు. దీంతో తండ్రిపైనే కేసు పెట్టి న్యాయం కోరింది అమృత. అలా తన పర్సనల్ లైఫ్‌తోనే కాంట్రవర్సీ క్రియేట్ చేసిన ఈమె.. బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్‌గా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు విశ్లేషకులు.

బర్రెలక్క

బిగ్ బాస్‌లోకి సినీ సెలబ్రిటీలు మాత్రమే కాదు.. పొలిటికల్ సెలబ్రిటీలు కూడా రావచ్చని బర్రెలక్క ప్రూవ్ చేయనుంది. చాలామంది యూత్.. అసలు రాజకీయాలు అంటే ఆసక్తి చూపించరు. కానీ బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష మాత్రం ఈసారి తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో పాల్గొనడానికి ముందుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. తను ఎన్నికల్లో ఓడిపోయినా కూడా బర్రెలక్క అంటే చాలామంది తెలిసేలా చేసింది. దీంతో తను కూడా బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్‌గా రావచ్చని రూమర్స్ వినిపిస్తున్నాయి.

కుమారీ ఆంటీ

ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిన వ్యక్తి ఒకరు ఉంటారు. అలా బిగ్ బాస్ సీజన్ 8లో కుమారీ ఆంటీ.. కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వనుందని రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు యూట్యూబర్‌గా ఫేమస్ అయిన గంగవ్వను కూడా ఇలాగే కంటెస్టెంట్‌గా తీసుకొచ్చారు బిగ్ బాస్ మేకర్స్. కొన్నిరోజుల తర్వాత వారే స్వయంగా తనను బయటికి పంపించేశారు కూడా. అయితే కుమారీ ఆంటీ విషయంలో కూడా ఈసారి అదే జరగనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

హేమ

టాలీవుడ్‌లో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకుంది హేమ. ఇప్పటికే తను తెలుగు బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. కానీ మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. అయితే ప్రస్తుతం హేమ చుట్టూ రేవ్ పార్టీ ఆరోపణలు తిరుగుతుండగా మరోసారి తనను కంటెస్టెంట్‌గా తీసుకొస్తే ప్రేక్షకుల్లో హైప్ పెరుగుతుందని బిగ్ బాస్ మేకర్స్ భావిస్తున్నారట. అందుకే బిగ్ బాస్ 8లో తనను కంటెస్టెంట్‌గా పిలవాలని సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. మరి హేమ.. ఈ ఆఫర్‌కు ఒప్పుకుంటుందో లేదా చూడాలి.

Also Read: ఒడిశాలో ఆ బిజినెస్ ప్రారంభించిన సన్నీ లియోన్

2024-07-03T10:03:50Z dg43tfdfdgfd