BRAHMAMUDI SERIAL TODAY APRIL 19TH: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కన్నతల్లి కోసం పసివాడు కన్నీళ్లు, ఇప్పటికైనా రాజ్ నిజం చెబుతాడా?

 Brahmamudi Today episode: ఇంట్లో బాబు ఏడుస్తున్నప్పుడు రాజు వెళ్లి ఊరుకోబెట్టడానికి చాలా  ప్రయత్నిస్తాడు కానీ ఫలితం ఉండదు. కింద హాల్లో ఇంట్లో వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకొని టీ పెట్టడం గురించి మాట్లాడుకుంటారు. నీ కోడలిని టీ పెట్టమను అంటే నీ కోడలిని టీ ఇవ్వమను అని వాదులాడుకుంటారు. ఈలోపు బాబు ఏడుపు వినిపిస్తుంది. ఆ బాబు ఎందుకు ఏడుస్తున్నాడు అని మొదలు పెట్టి రుద్రాణి అందర్నీ రెచ్చగొడుతుంది. ఈ హడావిలో కావ్య గుడి నుండి రానే వస్తుంది డాబా పైకి వెళ్లి పిల్లవాడిని చూసి బాబు ఒళ్లు చాలా వేడిగా ఉంది. అర్జెంటుగా హాస్పిటల్ లో జాయిన్ చేయాల్సిందే అని అని పరిగెత్తిస్తుంది.  

సుభాష్, కావ్య రాజ్ బాబును హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. బాబును చూసిన డాక్టర్ ఏంటో అర్థం కావట్లేదు. టెస్ట్‌లు చేయాలని చెబుతుంది. ఏమైందిరా అని సుభాష్ అడిగితే.. రాత్రి బాగానే ఉన్నాడు. ఉదయం నుంచే ఇలా ఏడుస్తున్నాడు అని రాజ్ అంటాడు. మరి నాకు చెబితే నేను గుడికి వెళ్లకుండా ఆగేదాన్ని కదా. అప్పటి నుంచి వాడిని కష్టపెడుతూ. మీరు కష్టపడుతున్నారు. అసలు వాడి తల్లి ఉంటే ఇదంతా ఉండేది కాదు అని రాజ్‌పై కావ్య ఫైర్ అవుతుంది.

మరోవైపు బాబుకు జరగరానిది జరిగితే.. ఇంటి పరువు పోతుంది. అప్పుడు బాబు తల్లి వచ్చి నా కొడుకు ప్రాణం తీస్తారా అని నిలదీస్తుంది. దాంతో మన ఇంటి మొత్తం జైలుకు వెళ్లాల్సి వస్తుంది. మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వస్తుంది అని అందరినీ భయపెడుతుంది రుద్రాణి.

హాస్పిటల్‌ లో .. 

రాజ్ : డాక్టర్ గారు .. బాబు కండిషన్ ఏంటి ? ఆ రిపోర్ట్స్ లో ఏం తేలింది? ఏమన్నా ప్రమాదమా?

డాక్టర్: రిపోర్ట్స్ నార్మల్‌గానే ఉన్నాయి. ఆ విషయంలో కంగారుపడాల్సిన అవసరం లేదు. కానీ, బాబుకు జ్వరం ఎందుకు వచ్చిందో, పాలు ఎందుకు తాగట్లేదో  అర్థం కావడం లేదు ?

కావ్య : మీరే ఇలా చెబితే మాకు మాత్రం ఏం తెలుస్తుంది ?

డాక్టర్:  బాబుకు అసలు తల్లి పాలు ఇస్తున్నారా. ఎందుకు ఇవ్వట్లేదు. ఎందుకు ఆపేశారు? మీరు నిజం చెబితే తప్ప నేనేం చేయలేను? 

కావ్య : నేను వీడి కన్నతల్లిని కాదు కాబట్టి !

సుబాష్ : కొన్ని కారణాలవల్ల బాబు తల్లి దూరంగా ఉంది. 

డాక్టర్ : అది సంగతి.. ఇప్పుడు బాగా అర్థం అయ్యింది.  బాబు తన తల్లిని బాగా మిస్ అవుతున్నాడు. బాబుకు తన తల్లి స్పర్శ కావాలి. తల్లి పాలు కావాలి. తల్లి ఒడిలోని వెచ్చదనం కావాలి. తల్లి ఎందుకు దూరంగా ఉందో నాకు తెలియదు. కానీ ఏ హాస్పిటల్‌కు వెళ్లినా  ఏం చేయలేరు. బాబుకు తన తల్లి కావాలి. బాబు మనసు తల్లీమీద బెంగతో ఉంది. ఇప్పుడు బిడ్డని తల్లికి అప్పగిస్తేనే బాబు క్షేమంగా ఉంటాడు. 

తర్వాత ఇంటికి వచ్చిన కావ్య వాళ్లను ఆగి విషయం అడుగుతుంది అపర్ణ. బాబుకు ఎలా ఉంది. డాక్టర్ ఏం చెప్పారు. బాబుకు తల్లి స్థానంలో వెళ్లిన అపరమాతృమూర్తివి కదా అని కావ్యని దెప్పిపొడుస్తుంది. దానికి కావ్య నేను తల్లి స్థానంలోనే వెళ్లాను. కానీ, ఈ ప్రపంచంలో ఏ స్త్రీ అయినా బాబుకు తల్లిగా   మారినా వ్యర్థమే అన్నారు. బాబుకు కన్నా  తల్లి స్పర్శ  కావాలన్నారు. కన్నతల్లి మాత్రమే వాడికి కావాలి అన్నారు. మాతృస్థానం ఎంత గొప్పదో తెలిసింది.  పాలు తాగే పసివాడికి అమ్మ ఒడిని మించిన  స్వాంతన లేదు అని అంటుంది కావ్య .

అంతా ఎమోషనల్‌ ఫీల్ అవుతారు.  బాబు తల్లి ఎవరో చెప్పమని అపర్ణ మండిపడుతుంది. కావ్య కూడా గట్టిగా ప్రశ్నిస్తుంది. ఇందిరాదేవి, ప్రకాశం కూడా కన్నతల్లి ఎవరో చెప్పమని రాజ్‌ను  అడుగుతారు. ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అదేంటో చెప్పు రాజ్ అంటుంది స్వప్న . నువ్ నోరు విప్పకుంటే ఇంట్లో అందరం ఇరుక్కునేలా ఉన్నాం. చట్టం దృష్టిలో అంతా దోషులుగా నిలబడతాం  అంటుంది రుద్రాణి. అందరూ తలో మాట అంటారు. 

రాజ్ : క్షమించు నాన్నమ్మ .. ఇప్పుడు నేనేమీ చెప్పలేను. బిడ్డకు తల్లి తండ్రి అన్ని నేనై పెంచుకుంటాను. వాడికి తల్లి మీద బెంగ పోయేలా ఇక నుంచి నేనే చూసుకుంటాను.

అపర్ణ: చెప్పడు.  వీడు నిజం చెప్పడు. ఈ నిజం ఇంటిని అగ్నిలా దహించే వరకు చెప్పడు. బిడ్డకు తల్లిని చూపించవు. మాకు నిజం చూపించవు. చాలా మంచిదిరా , ఆ దాపరికమే నీకు ముఖ్యం అయినప్పుడు మా పెద్దరికం  మౌనంగా చూస్తూ ఊరుకోలేదు. ఏ అనర్థం జరగకముందే, ఆ బిడ్డకి మా కళ్ళముందు ఏ ఆపదా రాకముందే నేను ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే .. 

తరువాయి భాగంలో .. 

బాబును సుభాష్ తీసుకెళ్లిపోతుంటే.. రాజ్ అడ్డుకుని ఎక్కడికీ తీసుకెళ్తున్నారని అడుగుతాడు. ఇంట్లోంచు నువ్ ఒంటరిగా బయటకు వెళ్లే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నువ్ నిజం బయట పెట్టాల్సిందే అంటాడు  సుభాష్. నిజం బయటపెట్టాల్సిన అవసరం వస్తే  తానే ఇంట్లోనుంచి బయటకు వెళతాను అంటాడు రాజ్. 

 సుభాష్ : నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి వస్తే.. నేనే ఆ నిజం బయటపెడతాను .. 

దాంతో రాజ్ షాక్  ఆ మాటలు దొంగతనంగా విన్న కావ్య షాక్ .. 

Also Read: త్రినయని సీరియల్: సుమన నటనకు గాల్లో ఉసిరి దీపాలు.. తొలిబిడ్డ జాడ నయనికి తెలిసిపోతుందా..!

2024-04-19T04:52:45Z dg43tfdfdgfd