CHANAKYA NITI : ఇలాంటివారికి గౌరవం ఇవ్వాల్సిన అవసరమే లేదు

చాణక్య నీతిలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు ప్రస్తావించాడు చాణక్యుడు. చాణక్యుడు ప్రకారం, ఒక వ్యక్తి యొక్క ఆత్మగౌరవం అతని గొప్ప సంపద. అయితే ఒక వ్యక్తికి లభించే గౌరవం అతని అలవాట్లపై ఆధారపడి ఉంటుందని చాణక్యనీతి చెబుతుంది. ఒక వ్యక్తి చెడు అలవాట్లను కలిగి ఉంటే, అతను జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటాడు.

అలాంటి వారు భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటారు. మీరు గౌరవించబడాలనుకుంటే, ముందుగా ఇతరులను గౌరవించండి. మనుషులను గౌరవించటానికి సంబంధించిన ఒక సత్యం చాణక్యనీతిలో కూడా చెప్పబడింది. చాణక్య నీతి ప్రకారం మీరు కొంతమందికి ఇచ్చే గౌరవం మీ స్వంత సమస్యలను పెంచుతుంది. అలాంటి వారికి ఎప్పుడూ గౌరవం ఇవ్వవద్దు అంటాడు చాణక్యుడు.

కొందరు వేరే పని చేయకుండా ముచ్చటగా మాట్లాడి ఇతరుల దగ్గర డబ్బు సంపాదించాలనుకునేవారు ఉంటారు. వాస్తవానికి, వారు ఇతరులను ప్రశంసించడం వెనుక కారణం వారి అసమర్థత బహిర్గతమవుతుందనే భయం. అలాంటి వారిని గౌరవించకూడదని చాణక్యనీతి చెబుతోంది. ఎందుకంటే అలాంటి వారికి గౌరవం ఇస్తే మిమ్మల్ని అసమర్థులుగా భావిస్తారు.

ఒంటరిగా నిలబడే ధైర్యం లేని వ్యక్తులను మీరు చూసే ఉంటారు. వారు సమూహంగా నడుస్తారు. సారూప్య స్వభావమున్న వ్యక్తులతో ఒక గుంపుగా ఏర్పడి ఇతర వ్యక్తులపై కుట్రపన్నుతారు. చిన్న సమస్య వచ్చినప్పుడల్లా, అలాంటి వ్యక్తులు వారి స్నేహితులతో కలిసి సమస్యను పెంచడం ప్రారంభిస్తారు. ఇతరుల జీవితాన్ని కష్టతరం చేస్తారు. అలాంటి వారికి గౌరవం దక్కదని చాణక్యనీతి అన్నారు. ఎందుకంటే అలాంటి వారిని గౌరవిస్తే సమాజంలో చెడు వ్యాప్తి చెందుతుంది.

అందరికీ బాగా దగ్గరగా స్నేహంగా ఉండే వ్యక్తి నిజంగా ఎవరికీ మిత్రుడు కాదు అనే సామెత ఉంది. అలాంటివారు ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడతారు, మీరు వెనుదిరిగితే మీ గురించి చెడుగా మాట్లాడతారు. అలాంటి వారిని ఎప్పటికీ నమ్మరు. అలాంటి వారికి గౌరవం ఇస్తే లాభం ఏమీ లేదు. మీ గురించి కూడా వెనకాల చెడుగా మాట్లాడుతారు.

హింసను పాపంగా పరిగణిస్తారు. జంతువులు, పక్షులు, పిల్లలు, కార్మికులు, వృద్ధులపై హింస ఎప్పటికీ క్షమించబడదని చాణక్యనీతి చెబుతుంది. అలాంటి వారిని గౌరవించకూడదు, శిక్షించాలి. ఎందుకంటే అలాంటి వారిని గౌరవించడం సమాజానికి, మానవత్వానికి హానికరం.

మరికొందరు ఇతరులను కించపరచడంలో ఆనందాన్ని పొందుతారు. ఇలా చేయడం వల్ల అందరి దృష్టిలో తాము పెద్దవాళ్లం అవుతున్నామని వారు భావించవచ్చు. కానీ నిజమేమిటంటే, అలాంటి వ్యక్తులు కొన్ని చిరాకులకు గురవుతారు. వారు తమను తాము ముఖ్యులుగా చూసుకోవడానికి ఇతరులను కించపరుస్తారు. తద్వారా ఇతరులు చిన్నగా కనిపిస్తారు. ముఖ్యంగా మహిళలను హీనంగా చూస్తూ అవమానించే వారికి గౌరవం దక్కదని చాణక్యనీతి చెబుతుంది.

2024-05-09T02:42:26Z dg43tfdfdgfd