DEEPIKA-RANVEER: బాలీవుడ్ జంట విడాకులు తీసుకోనున్నారా? ఫైనల్ గా వచ్చేసిన క్లారిటీ

Deepika Ranveer Divorce Clarity : వెండితెర మీద మాత్రమే కాక ఆఫ్ స్క్రీన్ లో కూడా తమ కెమిస్ట్రీ తో దీపికా పడుకొనే.. రణవీర్ సింగ్ అభిమానులను మెస్మరైజ్ చేస్తూ ఉంటారు. అందుకే బాలీవుడ్ లో ఉన్న స్టార్ జంటలలో వీళ్ళిద్దరికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అభిమానులు వీరిని ప్రేమగా దీప్వీర్ అని పిలుస్తారు. 

అయితే గత కొంతకాలంగా వీళ్లిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, వీళ్లు విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.. అని వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. త్వరలో దీపికా పడుకొనే..రణవీర్ సింగ్ తో విడాకులు కూడా తీసుకోబోతోంది అన్న పుకార్లు ఫ్యాన్స్ ను కంగారు పెట్టేసాయి.  అందులో నిన్న రణవీర్ సింగ్ ఇన్స్టాగ్రామ్ లోని తన ఫోటోలను తీసేయడంతో ఈ రూమర్ మరింత ఎక్కువయింది. అయితే దీనిపై హీరో పి ఆర్ టీం క్లారిటీ వచ్చింది. రణవీర్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో..ఒక్కటంటే ఒక్క పెళ్లి ఫోటో కూడా లేకపోవడంతో.. అభిమానులు మీరు తప్పకుండా డైవర్స్ తీసుకుంటారంటూ నిన్నటి నుంచి కామెంట్లు పెట్ట సాగారు. కానీ అసలు మ్యాటర్ ఏమిటంటే... 2023కు ముందు ఇన్‌స్టాగ్రామ్ అకౌంటులో చేసిన పోస్టులను రణవీర్ ఆర్చివ్ చేశారట. అందువల్ల, అవి ఏమీ కనిపించడం లేదట. గతంలో దీపికా పదుకోన్ సైతం ఓసారి ఈ విధంగా చేశారు. అయితే... ఇటువంటి అనుమానాలు రావడంతో ఆమె తర్వాత అన్ని పోస్టులను ఇన్‌స్టాలో ఉంచారు. ఆర్చివ్ చేయడం వల్ల పాత పోస్టులు కనిపించకుండా ఇన్‌స్టాకు కొత్త లుక్ వస్తుందని సెలబ్రిటీలు అప్పుడప్పుడూ అలా చేస్తారు. అదీ సంగతి!

ఇక మరో విధంగా కూడా ఈ జంట తమ పుకార్లకు చెక్ పెట్టింది. దీపిక పడుకొనే, రన్వీర్ సింగ్ ఇప్పుడు ముంబైలోని తమ బిసి బిజీ జీవితాల నుంచి చిన్న బ్రేక్ తీసుకొని.. వెకేషన్ కి వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇక ఇద్దరూ కలిసి సంతోషంగా వెకేషన్ కి వెళుతూ ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో ఫ్యాన్స్ కూడా హ్యాపీ అయ్యారు. 

కాగా 2012 నుంచి ప్రేమించుకుంటున్న దీపికా పడుకొనే రన్వీర్ సింగ్ 2018లో ఇటలీలోని లేక్ కోమో వద్ద డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఒక షోలో మాట్లాడుతూ రన్వీర్ సింగ్ 2015లో మాల్దీవ్స్ లో ఉన్నప్పుడు తాను దీపికాకి ప్రపోజ్ చేసిన సంగతి చెప్పాడు. ఈ మధ్యనే ఫిబ్రవరి లో తాము ఈ ఏడాది సెప్టెంబర్ లో తాము తల్లిదండ్రులు కాబోతున్నాము అన్న శుభవార్త కూడా చెప్పింది. ఇక సినిమాల పరంగా చూస్తే రన్వీర్ సింగ్ ఈ మధ్యనే రాఖీ ఆర్ రాణి కి ప్రేమ్ కహాని అనే సినిమాతో బ్లాక్ బస్టర్ అనుకున్నారు. మరోవైపు దీపిక పడుకొనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమాతో త్వరలో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతోంది.

Read More: Fake Rape Case: అత్యాచారం చేశాడని ఊరికే చెప్పా.. యువతికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కోర్టు..స్టోరీ ఏంటంటే..?

Read More: Sunita Williams: గణపతి ప్రతిమను తీసుకెళ్తా.. మూడోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమైన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-05-08T06:13:02Z dg43tfdfdgfd