DEVARA: ఇక వరసగా దేవర అప్డేట్స్.. పూర్తి వివరాలు మీకోసం!

Devara Promotions: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న.. దేవర సినిమా పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతూనే వస్తున్నాయి. కల్కి తర్వాత విడుదల కాబోతున్న పాన్ ఇండియా రేంజ్.. స్టార్ హీరో సినిమా దేవరనే. కొరటాల శివ దర్శకత్వం.. వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలో.. విడుదల కాబోతోంది. 

బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్..ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం చిత్ర బృందం.. సినిమా ప్రమోషన్స్ ని భారీ స్థాయిలో మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తాందట. 

సినిమా విడుదలయ్యేదాకా సినిమాకి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ విడుదల చేయాలని మూవీ యూనిట్ ఫిక్సయింది. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన డేట్స్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈనెల 15వ తేదీన సినిమాకి సంబంధించిన..రెండవ పాట విడుదల కాబోతోంది. ఈ నెలాఖరులో కూడా 30వ తేదీన సినిమాకి సంబంధించిన ఏదో ఒక ప్రమోషనల్ కంటెంట్ ని విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

ఆగస్టులో కూడా ప్రమోషన్స్ గట్టిగానే ప్లాన్ చేసిన చిత్ర బృందం ఐదో తారీఖున సినిమాకి సంబంధించిన.. మూడవ సింగల్ ని విడుదల చేయబోతోంది. ఆగస్టు 15న చెన్నైలో.. సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్ జరగబోతోంది. సెప్టెంబర్ మూడున సినిమా నుంచి నాలుగవ పాట విడుదల కాబోతోంది. 

సెప్టెంబర్ 7వ తేదీన సినిమా అధికారిక ట్రైలర్ భారీ అంచనాల మధ్య విడుదల కాబోతోంది. 10, 15వ తేదీల్లో ముంబైలోను యుఎస్ఏ లోను సినిమాకి సంబంధించిన ఈవెంట్లు ప్లాన్ చేస్తున్న.. చిత్ర బృందం సెప్టెంబర్ 20వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ.. స్థాయిలో ప్లాన్ చేస్తోంది. 

ఇక సెప్టెంబర్ 27న ప్యాన్ ఇండియా రేంజ్ లో.. ఈ సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్న చిత్ర బృందం..ఇక నుంచి మాత్రం సినిమాకి సంబంధించిన అప్డేట్లతో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుంది.అయితే ఇవన్నీ అభిమానులు షేర్ చేసిన ఊహగానాలు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో మాత్రం తెలియదు. అయితే మరోవైపు వస్తే మాకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. జులై 10 నుంచి ఎన్టీఆర్, జాన్వి కపూర్ ల మధ్య ఒక డ్యూయెట్ షూటింగ్ జరగబోతోందట. శంషాబాద్ లో ఒక భారీ సెట్ లో జరుగుతున్న జరగబోతున్న ఈ షూటింగ్ కి శేఖర్ మాస్టర్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

Also Read: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంచలనం.. 9 నెలల యువతి కేసు 9 రోజుల్లో పరిష్కారం

Also Read: C Naga Rani IAS: వెస్ట్‌ గోదావరికి పవర్‌ ఫుల్‌ ఆఫీసర్‌.. ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే అందరికీ హడలే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-07-03T13:44:03Z dg43tfdfdgfd