DIVI VADTHYA: బిగ్ బాస్ హౌస్లో అందుకే ఎఫైర్స్ పెట్టుకోలేదు, ఆఫర్స్ కోసం అది తప్పదు!

బిగ్ బాస్ ఫేమ్ దివి వాద్త్య లేటెస్ట్ ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించింది. క్యాస్టింగ్ కౌచ్ నుండి బిగ్ బాస్ షోకి వెళ్ళడానికి కారణాలు ఏమిటో చెప్పుకొచ్చింది. హౌస్లో తాను అఫైర్స్ అందుకో పెట్టుకోలేదని అసలు విషయం బయటపెట్టింది. 

 

బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ సక్సెస్. 2020లో కోవిడ్ ఆంక్షల మధ్య ఈ సీజన్ మొదలైంది. 19 మంది హౌస్ మేట్స్ పాల్గొనగా నటుడు అభిజీత్ విన్నర్ గా నిలిచాడు. కాగా తెలుగు నటి దివి వాద్త్య సైతం పాల్గొన్నారు. దివి హీరోయిన్ గా స్మాల్ బడ్జెట్ చిత్రాల్లో నటించారు. అలాగే మహేష్ బాబు మహర్షి మూవీలో కాలేజ్ స్టూడెంట్ గా చిన్న పాత్ర చేసింది. 

 

బిగ్ బాస్ షోకి వచ్చే వరకు దివి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. మంచి హైట్, స్లిమ్ బాడీతో దివి చాలా అందంగా ఉండేది. తన డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. దివి స్కిన్ షోకి, ఎఫైర్స్ కి దూరంగా ఉంది. అలాగే చాలా వరకు కామ్ గా ఉండేది. గొడవలు పడేది కాదు. 

సీజన్ 4లో అభిజీత్, అఖిల్ సార్థక్, సోహైల్, మెహబూబ్ వంటి హ్యాండ్సమ్ బాయ్స్ కంటెస్ట్ చేశారు. దివి ఎవరి పట్ల ఆసక్తి చూపలేదు. మోనాల్, అలేఖ్య హారిక మాత్రం హౌస్లో అఫైర్స్ నడిపారు. అమ్మ రాజశేఖర్ తో దివి స్నేహం చేసింది. ఆయనతోనే ఎక్కువగా మాట్లాడేది. 

 

బిగ్ బాస్ హౌస్లో ఎఫైర్స్ పెట్టుకోకపోవడానికి దివి కారణాలు తాజాగా వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ... నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు వెళ్ళకూడదు అనుకున్నాను. బిగ్ బాస్ షోకి వెళితే కెరీర్ నాశనం అవుతుంది. ఇప్పుడు వస్తున్న ఆఫర్స్ కూడా ఆ షో తర్వాత రావేమో అని భావించాను. చాలా మందిని సలహా అడిగి బిగ్ బాస్ షోకి వెళ్ళాను. 

బిగ్ బాస్ హౌస్ నుండి నేను పాజిటివ్ ఇమేజ్ తో బయటకు రావాలి అనుకున్నాను. అందుకే అఫైర్స్ పెట్టుకోలేదు. బాయ్ ఫ్రెండ్ లేకుండా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన అమ్మాయిని నేను మాత్రమే. బిగ్ బాస్ షో నుండి వచ్చాక కూడా కొన్ని ఆఫర్స్ చేజారాయి. 

చిత్ర పరిశ్రమలో అస్థిరత్వం ఎక్కువ. ఒక ప్రాజెక్ట్ చేసే వరకు ఆఫర్ మనది అనుకోవడానికి వీల్లేదు. మనం చేయాల్సిన పాత్ర ఎవరికైనా దక్కొచ్చు. వచ్చిన ఆఫర్ కోల్పోకుండా మేకర్స్ కి రెగ్యులర్ గా టచ్ లో ఉండాలి. అణిగిమణిగి ఉండాలి.. అని అన్నారు. దివికి రవితేజ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వచ్చి చేజారిందట. తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ప్రాధాన్యత లేదని ఆమె వాపోయింది. 

 

గతంతో పోల్చుకుంటే దివికి బిగ్ బాస్ షో తర్వాత ఆఫర్స్ పెరిగాయి. గాడ్ ఫాదర్, జిన్నా, రుద్రంగి వంటి చిత్రాల్లో ఆమె కీలక రోల్స్ చేసింది. అలాగే కొన్ని వెబ్ సిరీస్లలో నటించించి. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన లంబసింగి ఇటీవల విడుదలైంది. నెక్స్ట్ దివి పుష్ప 2 చిత్రంలో రిపోర్టర్ రోల్ చేస్తుంది.. 

2024-03-28T01:28:05Z dg43tfdfdgfd