GOOD FRIDAY WISHES : రేపే గుడ్​ ఫ్రైడ్.. మీ శ్రేయోభిలాషులకు విష్ చేసేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి

Good Friday Meaning : జీసస్​ని శిలువ వేసిన రోజును క్రైస్తవులు గుడ్​ ఫ్రైడే(Good Friday 2024)గా చేసుకుంటారు. దేవుడు తమ పాపాలన్నీ తన రక్తంతో కడిగేశారు అనే ఉద్దేశంతో ఫ్రైడేని గుడ్​ ఫ్రైడేగా చేసుకుంటారు. అయితే దీనిని బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు ముఖ్యమైన రోజు. పేరుకు మాత్రమే గుడ్​ ఫ్రైడే కానీ.. ఇది ఒక సంతాప దినం. ఈ పవిత్రమైన రోజు.. తమ భావోద్వేగాలను బంధువులు, స్నేహితులకు విషెష్ రూపంలో చెప్తారు. మీరు కూడా ఇలా వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా విషెష్ చెప్పాలనుకుంటే.. వీటిని ఫాలో అవ్వండి. 

మీరు గుడ్​ ఫ్రైడే విషెష్​ను మీ క్రిస్టియన్ ఫ్రెండ్స్​కి చెప్పాలనుకుంటే దానికి ముందు గుడ్​ని మాత్రం కలపకూడదు. సాధారణంగా పండుగలు, పుట్టినరోజుల సందర్భాల్లో విషెష్​కి ముందు గుడ్ చేర్చుతాము. కానీ గుడ్​ ఫ్రైడే రోజు మాత్రం హ్యాపీ గుడ్​ ఫ్రైడే అని మాత్రం చెప్పకూడదు. ఎందుకంటే ఇది సంతోషంతో జరుపుకునే వేడుకకాదు. దేవుడి వల్ల పాపాలు తొలగిపోయాయి అనే గుర్తుగా గుడ్​ అనే పదాన్ని చేర్చారు కానీ.. ఈరోజు ఏసు అత్యంత వేధన పొందిన దినంగా చెప్తారు. దీనివల్ల విషెష్ చెప్పే సమయంలో హ్యాపీ అనే పదాన్ని కలపకూడదని చెప్తారు. అయితే మీరు విషెష్​ని ఇలా కూడా చెప్పవచ్చు.

  • శిలువపై ఏసు చేసిన త్యాగం, దేవుని అపారమైన ప్రేమ, క్షమాపణను ఈ గుడ్​ ఫ్రైడే మనకు గుర్తు చేస్తుంది. ఆయనయందు మనం ఎల్లప్పుడూ భక్తి, శ్రద్ధలతో ఉండాలని కోరుకుంటూ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
  • ఈ గుడ్ ఫ్రైడే నాడు.. మీరు యేసు చేసిన త్యాగంతో బలం, ఓదార్పును పొందుతారని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించు గాక.
  • పరిశుద్ధమైన ఈ రోజును గుర్తు చేసుకుంటూ.. ఆయన ప్రేమ, కరుణ, కృపా, కటాక్షములు మనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. గుడ్​ ఫ్రైడే శుభాకాంక్షలు.
  • తండ్రి అయినా దేవుడి ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యూన్య సహవాసం మీకు ఎల్లప్పుడూ తోడు ఉండాలని.. మీరు చేసే ప్రయత్నాలలో దేవుని ప్రేమ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ గుడ్ ఫ్రైడ్ విషెష్ టు యూ.
  • గుడ్​ ఫ్రైడే ప్రాముఖ్యతను మీరు గుర్తించుకుని.. ఆ దేవుడి యందు అందరూ కృతజ్ఞతతో ఉండాలని కోరుకుంటూ.. గుడ్ ఫ్రైడ్ శుభాకాంక్షలు.
  • ఎవరూ చేయలేని విధంగా.. మన కోసం, మన పాపాల కోసం ఏసు ప్రాణాలు వదిలారు. ఆయన చేసిన త్యాగంతో మనకందరికీ శాంతి, ఆత్మసంతృప్తి కలుగును గాక.
  • ఈ రోజు మనందరి జీవితాల్లో చీకటి దినం. దీనిని ఏసు చేసిన త్యాగం, అపారమైన ప్రేమతో వెలిగిద్దాం. ఆయన చేసిన శాశ్వత త్యాగానికి కృతజ్ఞతలు తెలుపుదాం. మీకు, మీ కుటుంబానికి గుడ్​ ఫ్రైడే శుభాకాంక్షలు.
  • యేసు మన కోసం చేసిన నిస్వార్థమైన త్యాగానికి ప్రార్థనలతో ఆయనకు కృతజ్ఞతలు తెలుపుదాం. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
  • యేసు చేసిన పునరుత్థానం వాగ్ధానాన్ని అందరూ గుర్తుంచుకోని.. ఆయన రాకకై ఎదురు చూడాలని కోరుకుంటూ.. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.

మీరు క్రిస్టియన్ ఫ్రెండ్స్​కి, కుటుంబసభ్యులకు ఈ విధంగా విషెష్ చేయవచ్చు. లేదంటే స్టేటస్​లు, కోట్స్ రూపంలో వాటిని షేర్ చేయవచ్చు. 

Also Read : గుడ్​ ఫ్రైడే తేది ప్రతి ఏటా ఎందుకు మారుతుంది? జీసస్ చనిపోయిన రోజును గుడ్​ ఫ్రైడేనే అని ఎందుకంటారు?

2024-03-28T07:21:11Z dg43tfdfdgfd