HANUMAN JAYANTI 2024: తమలపాకులంటే ఆంజనేయుడికి ఎందుకంత ప్రీతి!

Hanuman Jayanti 2024: పిల్లలకు సూపర్ హీరో...పెద్దలకు ధైర్యాన్నిచ్చే ఆరాధ్య దైవం హనుమంతుడు. గ్రహదోషాల నుంచి విముక్తి పొందేందుకు, ఆయురారోగ్యాలకోసం ఆంజనేయుడికి పూజిస్తారు. ముఖ్యంగా మంగళవారం, శనివారం రోజు హనుమాన్ ని పూజిస్తే శనిబాధల నుంచి విముక్తి కలుగుతుందంటారు. ప్రత్యేక పూజలో భాగంగా కొందరు సింధూరం సమర్పిస్తారు...మరికొందరు వడమాల వేస్తారు..ఇంకొందరు తమలపాకులతో పూజచేస్తారు. ముఖ్యంగా ఆంజనేయుడికి తమలపాకులంటే ఎందుకంత ఇష్టం...దీని గురించి పురాణాల్లో ఓ కథ చెబుతారు...

Also Read: ఏప్రిల్ 23 చైత్ర పూర్ణిమ రోజు హనుమాన్ జయంతి కాదు హనుమాన్ విజయోత్సవం - ఈ రెండింటికి వ్యత్యాసం తెలుసా!

 

తమలపాకుతో ఆశీర్వచనం

సీతారాములు వనవాసంలో ఉన్న సమయంలో కపట సన్యాసి వేషధారణలో వచ్చిన రావణుడు సీతమ్మను ఎత్తుకెళ్లిపోతాడు. మారీచుడి మాయ నుంచి బయటపడిన తర్వాత రామలక్ష్మణులు పర్ణశాలకు వచ్చి చూసిన తర్వాత సీత కనిపించడకపోవడంతో అన్వేషణ ప్రారంభిస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా హనుమంతుడిని కలుసుకుంటారు.  జటాయువు ద్వారా సీతను రావణుడు ఎత్తుకుపోయాడని తెలుసుకుంటారు. రాముడి ఆజ్ఞతో లంకకు వెళ్లిన ఆంజనేయుడు అశోకవనంలో ఉన్న సీతమ్మను చూసి..రాముడి ఆనవాలు ఇస్తాడు. ఆ తర్వాత లంకాదహనం చేసి తిరిగి వస్తాడు. లంక నుంచి బయలుదేరి శ్రీరాముడి దగ్గరకు వచ్చే సమయంలో సీతాదేవి ముందు అంజలి ఘటిస్తాడు హనుమంతుడు...ఆ సమయంలో దీవించేందుకు పూలు లేకపోవడంతో ఆ పక్కనే ఉన్న తమలపాకు తీగనుంచి ఓ ఆకు తెంపి హనుమంతుడి తలపై పెట్టి దీవిస్తుంది. అప్పటి నుంచి పవన సుతుడికి తమలపాకులంటే ప్రీతి...వాటితో పూజిస్తే చాలు వరాలు గుమ్మరిస్తాడని భక్తుల విశ్వాసం..

Also Read: వ్యతిరేక దిశలో ప్రవహించే నర్మదా నది ప్రేమకథ తెలుసా!

ఆగ్రహాన్ని తగ్గించే శాంతరూపం 

ఆంజనేయస్వామి రుద్రసంభూతుడు. రుద్రుడు అంటే శివుడు...ఆయన ఆగ్రహానికి ప్రతిరూపం అయితే తమలపాకులు శాంతానికి నిదర్శనం. అందుకే రుద్రసంభూతుడిని తమలపాకులతో పూజిస్తే మనసుకి ప్రశాంతత చేకూరుతుందని చెబుతారు. వీటికున్న మరోపేరు నాగవల్లీ దళాలు... వీటితో హనుమాన్ ని పూజించడం వల్ల నాగదోషాలున్నా తొలగిపోతాయంటారు...

Also Read: నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయ్ - 12 రోజుల్లో ఏ రోజు ఏ దానం చేయాలో తెలుసా!

ఎన్ని ఉపశమనాలో

ఆంజనేయ స్వామికి తమల పాకుల హారాన్ని వేస్తే వైవాహిక జీవితంలో కలతలు తొలగిపోతాయి. నిత్యం అనారోగ్యంతో బాధపడే పిల్లల పేరుమీద ఆంజనేయుడికి ఈ ఆకువతో పూజచేస్తే త్వరగా కోలుకుంటారు. శనిదోషం వెంటాడుతున్న వారు పవనసుతుడికి తమలపాకులతో పూజచేస్తే ఉపశమనం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు, గ్రహసంబంధ పీడలు తొలగిపోతాయి. ఉద్యోగం, వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు మాయమవుతాయి.

మరీ ముఖ్యంగా సుందరకాండ పారాయణం చేసి హనుమాన్ కి తమలపాకు హారం సమర్పిస్తే చేపట్టే అన్ని కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. 

Also Read: ఈ ఏడాది మే 1 నుంచి నర్మదానది పుష్కరాలు - ఘాట్ల వివరాలివే!

గమనిక: ఇవి పురాణాల్లో, కొన్ని పుస్తకాల్లో ప్రస్తావించినవి, పండితుల నుంచి తెలుసుకున్న విషయాలు. వీటిని ఎంతవరకూ అనుసరించాలి అన్నది అన్నది పూర్తిగా మీ భక్తి విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. 

2024-04-19T09:52:51Z dg43tfdfdgfd