HUSBAND KILLED WIFE: పురుగుల మందు తాగించి భార్యను హత్య చేసిన భర్త, సహకరించిన మామ, ఆత్మహత్యగా చిత్రీకరణ

Husband Killed wife: క‌ట్టుకున్న భర్తే కాల య‌ముడు... భార్య‌కు తండ్రితో కలిసి పురుగుల మందు తాగించిన భ‌ర్త, ఆపై ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించాడు. ఆసుప‌త్రిలో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నంలోని గాజువాక‌లో చోటు చేసుకుంది. పోలీసులు భ‌ర్త‌, బాధితురాలి అత్త‌మామ‌ల‌ను అరెస్టు చేశారు.

విశాఖ‌ప‌ట్నంలోని గాజువాక‌లో ఎస్‌.ప‌ద్మిని, సోమేశ్వ‌ర‌రావు దంప‌త‌లు ఉన్నారు. వీరికి 2018లో వివాహం జ‌రిగింది. ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. తొలుత భర్త బాగానే ఉన్నా ఆ తరువాత‌ అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. అందుకు అత్తామామలు తోడయ్యారు. తీసుకురాలేనని పద్మిని చెప్పడంతో చంపేయాలనుకున్నారు.

జూన్ 26న జరిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. రాత్రి ప‌ద్మిని ఒక గ‌దిలో బంధించి పురుగుల మందు తాగించారు. సోమేశ్వ‌రరావు, అత‌ని తండ్రి క‌లిపి ఈ ఘాతుకానికి వ‌డిగ‌ట్టారు. పద్మినికి సోమేశ్వ‌ర‌రావు తండ్రి నోట్లో పురుగుల మందు పోశాడు. ఆమె భర్త ఆ మందు కక్కకుండా నోటికీ చేతిని అడ్డుపెట్టుపెట్టాడు. ఇద్ద‌రు క‌లిసి బలవంతంగా పురుగులు మందు తాగించారు.

దీంతో ఆమెకు వాంతులయ్యాయి. ఇరుగు పొరుగు చూసి ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో ఏం తెలియనట్లుగా కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జూలై నెల‌లో మృతి చెందింది.

అయితే ఆమె చనిపోయే ముందు ఆసుప‌త్రిలో త‌న స్వంత ద‌స్తూరితో రాసిన లేఖ‌లో వివిధ అంశాల‌ను వివ‌రించింది. వివాహం అయింది మొద‌లు ఆమెపై అత్తామామ‌లు వేధింపులు, భౌతిక దాడులు నిత్యంకృత్యమ‌య్యాయ‌ని, పెగ్నెన్సీ స‌మ‌యంలో కూడా అత్త‌మామ‌లు కొట్టేవారు. అలాగే భ‌ర్త సోమేశ్వ‌ర‌రావు బెల్టుతో క‌ర్ర‌ల‌తో కోట్టేవాడ‌ని పేర్కొంది. త‌ను చ‌చ్చిపోవాల‌ని భ‌ర్త వేధించేవాడ‌ని తెలిపింది. అప్పుడు తాను కేసు పెట్టాన‌ని, పోలీసులు రాజీ కుదుర్చి పంపించార‌ని తెలిపింది.

ఆ త‌రువాత అత్త‌మామ‌ల‌తో కాకుండా వేరే కాపురం పెట్టామ‌ని, అయితే అప్పుడు కూడా క‌ష్టాలు త‌ప్ప‌లేద‌ని పేర్కొంది. ప్ర‌తి రోజూ కొట్టేవాడ‌ని, మా నాన్న నాకు ఫోన్ కొనిస్తే, ఆఫోన్‌ను ఆయ‌న లాక్కొని వాడుకొనేవాడు. త‌న‌కు వేరే వ్య‌క్తితో అక్ర‌మ సంబంధం ఉంద‌ని అంట‌గ‌ట్టి పుట్టింటికి పంపించేశాడ‌ని, అప్పుడు మ‌ళ్లీ పెద్ద‌లు స‌ర్దిచెప్పి కాపురానికి పంపించార‌ని తెలిపింది.

అప్పుడు కొన్ని రోజులు బాగానే ఉన్నారు. కాపురం బాగానే సాగేంది. అప్పుడు రెండో పెగ్నెన్సీ వ‌చ్చింది. అయితే అబార్ష‌న్ మాత్ర‌లు ఇచ్చి వేసుకుంటావా లేదాఅని కొట్టాడు. అలా అబార్ష‌న్ మాత్ర‌లు వేయించి, అబార్ష‌న్ చేయించాడు. అయితే వేధింపులు మాత్రం ఆగ‌లేదు. దీంతో ప‌ద్మిని పుట్టింటికి వెళ్లిపోయింది.

మ‌ళ్లీ పెద్ద‌లు స‌ర్దిచెప్పి కాపురానికి పంపించారు. కొన్ని రోజులు బాగానే ఉండేవాడు. దీంతో మ‌ళ్లీ ప‌ద్మినికీ పెగ్నెన్సీ వ‌చ్చింది. ఈసారి ఆసుప‌త్రికి కూడా తీసుకెళ్లేవాడు కాదు. భోజ‌నం చేస్తుంటే, నీకెందుకు భోజ‌నం అంటూ ముందున్న కంచాన్ని లాగేసేవాడు. అలాగే పెగ్నెన్సీ స‌మ‌యంలో కొట్టేవాడు, జుట్టుప‌ట్ట‌కుని మెట్లు మీద నుంచి ఈడ్చేవాడ‌ని లేఖ‌లో పేర్కొంది. కొన్ని రోజుల‌కు ప‌ద్మిని అమ్మ డెలివ‌రీకి తీసుకెళ్లింది. బాబు పుట్టాడు. కొన్నాళ్లు భాగ‌నే ఉన్నారు.

ఆ త‌రువాత భ‌ర్త అత్త‌మామ‌లు, ఆడ‌పుడుచు, మ‌రిది, క‌న‌క‌రాజు త‌నను 15 రోజుల పాటు అద‌న‌పు క‌ట్నం గురించి వేధించి ఇబ్బందుల‌కు గురిచేశారని వాంగ్మూలంలో పేర్కొంది. ఆ త‌రువాత భ‌ర్త సోమేశ్వ‌ర‌రావు గ‌డ్డి మందు తెచ్చి రాత్రి ప‌ది గంట‌ల స‌మ‌యంలో జుట్టు ప‌ట్టుకొని తాగించాడని, మూడు రోజులు గ‌దిలో బంధించి, మూడు రోజుల త‌రువాత ఆసుప‌త్రికి తీసుకెళ్లాడ‌ని మ‌ర‌ణ వాగ్మూలంలో ఆమె పేర్కొంది.

ఈ జరిగినదంతా ఆడియో రికార్డు చేసి మేనమామకు, బంధువులకు పంపింది. త‌న భ‌ర్త అద‌న‌పు క‌ట్నం కోసం వేధిస్తున్నాడ‌ని, ఇప్ప‌టికే త‌న బంగారం అంతా తాక‌ట్టు పెట్టి రైస్ షాప్ పెట్టాడ‌ని అందులో పేర్కొంది. అలాగే పుట్టింటి వ‌ద్ద ఉన్న త‌న వాట ఆస్తిని అమ్మి డ‌బ్బులు తేవాల‌ని కొడుతున్నాడ‌ని పేర్కొంది. త‌న‌కు పురుగుల మందు తాగించిన అంశాన్ని కూడా అందులో పేర్కొంది.

నా భ‌ర్త పిల్లలను బ్రతకనివ్వడని, తన ఇద్దరు పిల్లలకు రక్షణ కల్పించి న్యాయం చెయ్యాల‌ని ఆడియో రికార్డ్ లో ఆవేదన వ్యక్తం చేసింది. ఆడియో రికార్డు విన్న బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు. చివరకు ఆమె ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో భర్త సోమేశ్వరరావు, బాధితురాలి అత్తామామల్ని గాజువాక పోలీసులు అరెస్టు చేశారు.

(రిపోర్టింగ్ జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

2024-07-03T04:13:57Z dg43tfdfdgfd