INDIAN 2 MOVIE: భారతీయుడు 2 ఆలస్యానికి అదే రీజన్.. శంకర్‌తో కష్టమే

కమల్ హాసన్- దర్శకుడు శంకర్ కాంబోలో వస్తున్న 'భారతీయుడు 2' (Indian 2) కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చూస్తున్న ఫ్యాన్స్‌కి శంకర్ మరో షాకిచ్చాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని అందరూ అనుకుంటుంటే ఇంకా కొంత బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. అయితే కమల్ కూడా ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని ప్రకటించారు. కానీ కమల్‌పై ఓ సాంగ్‌ను షూట్ చేయాలని డైరెక్టర్ శంకర్ అనుకుంటున్నారట.

ఇదే రీజన్

నిజానికి ఈ సినిమా జూన్‌లో రిలీజ్ అవుతుందని ఎప్పటి నుంచో చెబుతున్నారు. కానీ ఇప్పుడు సడెన్‌గా ఇంకా ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉందని వార్తలు రావడంతో సినిమా రిలీజ్ వాయిదా పడక తప్పదని తెలుస్తోంది. ఇప్పుడు సినిమా ఆలస్యానికి ఈ సాంగ్ షూట్ కూడా ఓ కారణమైందట.

ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, బాబీ సింహా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-08T06:02:37Z dg43tfdfdgfd