JIO CINEMA: రూ.29కే థియేటర్‌ రేంజ్‌లో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు.. జియో సినిమా ప్లాన్‌ ఇదే

JioCinema 29 Plan: ఓటీటీలతో వినోదం ఇంటికే వచ్చేసింది. దేశంలో ఎన్నో ఓటీటీ సంస్థలు ఉండగా.. జిజీ సినిమా మాత్రం ప్రముఖమైనది. ఐపీఎల్‌ ఉచితంతో అనూహ్యంగా సబ్‌స్క్రైబర్లను పెంచుకున్న జియో సినిమా తన వినియోగదారులకు మరో తీపి కబురు అందించింది. అతి తక్కువ ఖర్చుకే థియేటర్‌ రేంజ్‌లో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, సీరియల్స్‌, ఇతర ఏవైనా కంటెంట్‌ చూసేందుకు అవకాశం కల్పించింది. 4కే నాణ్యతతో అద్భుతమైన వీడియో నాణ్యత, ఆఫ్‌లైన్‌లో కంటెంట్‌ చూసే అవకాశం లభించనుంది. ఎలాంటి వ్యాపార ప్రకటనలు లేకుండా చూడవచ్చు. జియో సినిమా ప్రీమియం సభ్యులు స్మార్ట్‌ టీవీలతోపాటు ఏ పరికరంలోనైనా చూసేయవచ్చు. ఈ అద్భుత ప్లాన్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Cheap Air Fares: విమాన ప్రయాణికులకు బంపరాఫర్‌.. బిర్యానీ ధరకే విమాన ప్రయాణం

ప్లాన్‌ వివరాలు

ధర: రూ.29

వ్యవధి: నెల రోజులు

ప్రత్యేకతలు: 4కే వీడియో నాణ్యత. ఆఫ్‌లైన్‌లో కూడా కంటెంట్‌ చూడవచ్చు. వ్యాపార ప్రకటనలు లేకుండా చూడవచ్చు.

ఏమేం చూడొచ్చు: సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, పిల్లల షోలు, హలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాలు. ఇక టీవీలో ప్రసారమయ్యే అన్ని సీరియల్స్‌, షోలు చూడవచ్చు.

ఎక్కడ: ఈ ప్లాన్‌తో స్మార్ట్‌ టీవీ, స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబెట్ల తదితర పరికరాల్లో కంటెంట్‌ చూడవచ్చు.

Also Read: V Guard Arizor Wires: ఇంటికి రక్ష ‘అరిజో’ తీగలు.. వి-గార్డ్ నుంచి సరికొత్త ఆవిష్కరణ

ఇంటిల్లిపాదికి ప్లాన్‌ఇంటిల్లిపాదికి ప్లాన్‌

జియో సినిమా మరో ప్లాన్‌ కూడా ప్రకటించింది. 'ఫ్యామిలీ ప్లాన్‌' పేరుతో తీసుకొచ్చిన ఈ ప్లాన్‌ ధర రూ.89. నెల వ్యవధి ఉన్న ఈ ప్రీమియమ్‌తో జియో సినిమాను ఒకేసారి నాలుగు వేర్వేరు స్క్రీన్‌లలో చూడవచ్చు. ఇప్పటికే ఉన్న జియో సినిమా ప్రీమియర్‌ సభ్యులు ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఆటోమేటిక్‌గా ఫ్యామిలీ ప్లాన్‌కు అప్‌గ్రేడ్‌ పొందుతారు.

క్రికెట్‌

ప్రస్తుతం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రసవత్తరంగా సాగుతోంది. ఈ ప్రఖ్యాత లీగ్‌ను ఉచితంగా వీక్షిస్తున్నారు. అయితే ప్రీమియం చేసుకుంటో మాత్రం ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. జియో సినిమా ప్రీమియం చేసుకుంటే అంతర్జాతీయ అంటే హలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు చూసే అవకాశం పొందుతారు. పీకాక్‌, హెచ్‌బీఓ, వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ వంటి పెద్ద స్టూడియోల సినిమాలు చూసేవచ్చు. ఇంకో ప్రత్యేకం ఏమిటంటే ఈ కంటెంట్‌ను మొత్తం మన మాతృభాషలో కూడా చూడవచ్చు.

ప్రస్తుతం జియో సినిమాలో ఇంటిల్లిపాదికి కావాల్సిన వినోదం లభిస్తుంది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఉన్నాయి. కాగా మరికొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. బాలాకోట్‌, బియాండ్‌ అండ్‌ మర్డర్‌ ఇన్‌ మహిమ్‌ విడుదల కానున్నాయి. జర హత్కే జర బచ్‌కే అనే సినిమా మేలో విడుదలయ్యే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

   

2024-04-25T11:09:36Z dg43tfdfdgfd