JR NTR: ముంబై పార్టీలో జంటగా ఎన్టీఆర్.. రణబీర్, ఆలియా, హృతిక్‌లతో కలిసి

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర: పార్ట్ 1 షూటింగ్‌ను పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇటీవల తన తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ వార్ 2 షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలసి ఎన్టీఆర్ నటిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ బాంద్రాలోని ఓ రెస్టారెంట్‌కి డిన్నర్‌కి వెళ్లారు. ఈ డిన్నర్‌ డేట్‌లో రణబీర్-అలియా భట్, హృతిక్ రోషన్, కరణ్ జోహార్‌లతో కలిసి ఎన్టీఆర్ సతీసమేతంగా సందడి చేశారు.

ఫ్యాన్‌కి ఎన్టీఆర్ గిఫ్ట్

ఇక డిన్నర్ ముగిసి ఎన్టీఆర్ బయటికి వచ్చేలోపు ఫొటోగ్రాఫర్లు, ఫ్యాన్స్ తెగ గోల చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ను ఓ లేడీ ఫ్యాన్ సెల్ఫీ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేసింది. ఈరోజు తన బర్త్‌డే అని చెప్పడంతో ఎన్టీఆర్ పిలిచి మరీ సెల్ఫీ ఇచ్చారు. ఇక పార్టీ తర్వాత వీరంతా బయటికి వస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరోవైపు వార్ 2 సినిమా కోసం ఎన్టీఆర్ మొత్తం 60 రోజుల కాల్ షీట్స్ కేటాయించిన‌ట్టు సమాచారం. వార్ 1ను మించిపోయేలా వార్ 2 సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయని టాక్. 2025 ఆగష్టు 14న ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌కి ఇదే తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్. ఈ చిత్రంలో సీక్రెట్ ఏజెంట్‌గా ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్నారు. అయితే తన లుక్‌ను సీక్రెట్‌గా ఉంచేందుకు ఎన్టీఆర్ తెగ కష్టపడుతున్నారు. అందుకే ఇటీవల మీడియా ఫొటోలు తీస్తుంటే ఎన్టీఆర్ సీరియస్ కూడా అయ్యారు.

దేవరమరోవైపు కొరటాల శివ డైరెక్షన్‌లో చేస్తున్న దేవర సినిమా ఈ ఏడాది అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇది పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టబోతున్నారు కొరటాల. ఇప్పటికీ ఈ సినిమా మ్యూజిక్ అదిరిపోయిందంటూ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ చెప్పిన సంగతి తెలిసిందే. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. మొత్తం రెండు భాగాలుగా దేవర సినిమా రాబోతుంది. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు టాక్. ఇక ఎన్టీఆర్ చివరిగా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కనిపించారు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి నటించారు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా దుమ్ముదులిపింది. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ రావడంతో గ్లోబల్ స్థాయిలో భారత్‌కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ఆర్ఆర్ఆర్.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-29T03:57:43Z dg43tfdfdgfd