KALKI 2898 AD: ఆ ఐదు బ్లాక్ బస్టర్ హాలీవుడ్ చిత్రాల నుంచే ప్రేరణ పొందారా?

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్‌-కె’ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. 

 ప్రభాస్, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రేజీ కాంబినేష్‌లో రూపొందుతున్న లార్జ్ దెన్ లైఫ్, ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’ పై చాలా ఎక్సపెక్టేషన్స్ ఉన్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ సంస్థకు ఎంతో విశిష్టమైన రోజున విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించి ఉన్నారు. కానీ ఈ చిత్రం ఆ రోజున అనగా మే 9వ తేదీన విడుదల కావడం లేదు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు. అయితే ఈ పోస్టర్ రిలీజైన తర్వాత ఈ సినిమా ఫలానా సినిమాకు దేశీ వెర్షన్ లా ఉందంటూ ట్రోలింగ్ మొదలైంది. ఇంతకీ ఏమిటా సినిమాలు..

‘కల్కి 2898 AD’ చిత్రం ముందు చెప్పిన మే 9వ తేదీన కాకుండా.. జూన్ 27 (June 27)వ తేదీన గ్రాండ్‌గా విడుదల కాబోతోందని తెలుపుతూ.. ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్‌లో రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాటు.. దీపికా పదుకొణె, అమితాబచ్చన్ కూడా ఉన్నారు. ఇదొక వార్ సీన్‌లా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   అలాగే ఈ చిత్రం ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్స్ ని చూసి హాలీవుడ్ భారీ చిత్రాలను గుర్తు చేస్తోందంటున్నారు. 

హాలీవుడ్  సూపర్‌ హిట్‌ ఫ్రాంచైజీల్లో ‘మ్యాడ్‌ మ్యాక్స్‌’ (Mad Max) ఒకటి. యాక్షన్‌, అడ్వెంచ‌ర్‌, సర్వైవల్ జాన‌ర్‌లో వ‌చ్చిన‌ ఈ సిరీస్‌ చిత్రాలు యావత్‌ సినీ ప్రియుల్ని విప‌రీతంగా ఆకట్టుకున్నాయి. 1979లో ‘మ్యాడ్‌ మ్యాక్స్‌’ పేరుతో ప్రారంభమైన ఈ ఫ్రాంఛైజీ ఆ తర్వాత 1981లో మ్యాడ్ మ్యాక్స్ 2 (ది రోడ్ వారియర్) 1985లో మ్యాడ్ మ్యాక్స్3 (బియాండ్‌ థండర్‌డోమ్‌), 2015లో మ్యాడ్ మ్యాక్స్ (ఫ్యూరీ రోడ్) అనే నాలుగు భాగాలుగా వచ్చి ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను విశేషంగా అలరించింది.మొదటి మూడు భాగాలలో మెల్‌ గిబ్సన్‌ హీరోగా నటించగా నాలుగో చిత్రం ‘మ్యాడ్‌ మ్యాక్స్‌: ఫ్యూరీ రోడ్‌’లో టామ్‌ హార్డీ హీరోగా నటించారు. ఈ చిత్రంలో విజువల్స్ ...కల్కిలో విజువల్స్ పోలిక పెడుతున్నారు సోషల్ మీడియా జనం.

 

స్టార్ వార్స్ చిత్రం  జార్జ్ లూకాస్ రూపొందించినఒక అద్బుతంగా చెప్తారు.య  అమెరికన్ ఎపిక్ స్పేస్ ఒపెరా మీడియా ఫ్రాంచైజ్  1977 లో ప్రారంభమైంది . ఈ సినిమా వచ్చాక వరసపెట్టి  టెలివిజన్  సీరియల్స్ , వీడియో గేమ్‌లు , నవలలు , కామిక్ పుస్తకాలు , థీమ్ పార్క్ ఇలా ఏదో ఒకటి ఎప్పుడూ ఈ స్టార్స్ వార్స్ ప్రపంచాన్ని బేస్ చేసుకుని వస్తూనే ఉంటోంది,   స్టార్ వార్స్ పెద్ద హిట్ సినిమా.ఇందులో మనుషులు అనేక రకాల గ్రహాంతరవాసులు (తరచుగా మానవరూపం ) రోబోట్‌లతో కలిసి జీవిస్తూంటారు. ఆ సినిమాని గుర్తు చేస్తోందంటున్నారు కల్కి విజువల్స్ లో కొన్ని.

సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ డూన్: పార్ట్ టూ ఈ మధ్యనే రిలీజైంది.  ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా డెనిస్ విల్లెనెయువ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆయనే నిర్మించారు. డూన్ చిత్రానికి ఈ సినిమా సీక్వెల్. ఫ్రాంక్ హెర్బర్ట్ రచించిన 1965 నవల ఆధారంగా ఈ సినిమాలను తెరకెక్కించారు. ఆస్టిన్ బట్లర్, ఫ్లోరెన్స్ పగ్, క్రిస్టోఫర్ వాల్కెన్, జెండయా, జోష్ బ్రోలిన్, తిమోతీ చలమెట్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 190 మిలియన్ డాలర్లతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 634.4 మిలియన్ డాలర్లను వసూళ్లు చేసి ట్రెండ్ సెట్ చేసింది.

సైన్స్ ఫిక్షన్ చిత్రాల్లో బెస్ట్ గా చెప్పే బ్లేడ్ రన్నర్ 2049 గురించి తెలియని సినిమా ప్రియులు ఉండరు. ఈ సినిమాకు ఎంచుకున్న విజువల్స్, ఎట్మాస్మియర్, విజువల్ గా మెస్మరైజింగ్ గా ఉంటాయి. కల్కి చిత్రానికి దీన్ని బేస్ గా తీసుకుని చేసారని అంటున్నారు. సినిమా మూడ్ ని ఎంచుకోవటానికి కల్కి కు ఈ సినిమా రిఫరెన్స్ గా పెట్టుకుని ఉండవచ్చు అనిది సినిమా జనం చెప్పే మాట.

మార్వెల్  స్టూడియోస్  బ్యాన‌ర్ నుంచి  లాస్ట్ ఇయిర్  వ‌చ్చిన   చిత్రం గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 (Guardians of the Galaxy V3 ) ని చాలా మంది చూసే ఉంటారు.  ఈ చిత్రానికి హాలీవుడ్ డైరెక్ట‌ర్ జేమ్స్ గన్ (James Gun) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. క్రిస్ ప్రాట్ (Chris Prat), జో సల్దానా(Zoe Saldana), కరెన్ గిల్లాన్ (Karen Gillan) లీడ్ రోల్స్‌లో న‌టించారు. ఫ‌స్ట్ రెండు భాగాల‌కు కొన‌సాగింపుగా వ‌చ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం సాధించింది. ఇక గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సిరీస్‌లో ఇదే చివరి సినిమా. ఈ సినిమా ఇన్ఫూలియెన్స్ కూడా కల్కిలో ఉందంటున్నారు. 

దర్శకుడు నాగ్‌అశ్విన్‌ మాట్లాడుతూ ‘ఫ్యూచరిస్టిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రమిది. నేను సైన్స్‌ ఫిక్షన్‌, పురాణాలను బాగా ఇష్టపడతాను. మహాభారతం, స్టార్‌వార్స్‌ చూస్తూ పెరిగాను. ఈ రెండు ప్రపంచాలను కలిపే సినిమా చేయడం గర్వంగా ఉంది’ అన్నారు. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దీపికా పడుకోన్‌, దిశాపటానీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు.

 

 మహాభారతం తో మొదలై.. క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే కథ ఇది. మొత్తం 6 వేల ఏళ్ల వ్యవధిలో ఈ కథ విస్తరించి ఉంటుంది. గతం, భవిష్యత్తుతో ముడిపడి ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్టుగా భారతీయతను ప్రతిబింబించేలా సరికొత్త ప్రయత్నాలు సృష్టించారు నాగ్ అశ్విన్ 

ఇప్పటికే ఈ చిత్రం  అనేక మంది స్టార్స్ నటిస్తున్న విషయం తెలిసిందే! మరో ఇద్దరు హీరోలు ఈ చిత్రంలో భాగం కానున్నారని తెలుస్తోంది. నాని, విజయ్‌ దేవరకొండ  ఇందులో అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మలయాళ నటి అన్నాబెన్‌ కూడా ‘కల్కి’లో నటించనున్నట్లు స్వయంగా వెల్లడించారు. 

 కల్కి  సినిమా చిత్రీకరణను వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖర్చు విషయంలో ఎక్కడా వెనుకాడటం లేదనేది ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ చూస్తుంటే తెలుస్తోంది. రీసెంట్‌గా ప్రభాస్, దీపికలతో పాటు అమితాబ్ లుక్స్‌కు సంబంధించి విడుదల చేసిన వీడియోలు, అంతకు ముందు విడుదల చేసిన టీజర్.. ఎటువంటి స్పందనను రాబట్టుకున్నాయో తెలియంది కాదు. జూన్‌లో ప్రేక్షకులను మరో సరికొత్త ప్రపంచంలోకి ఈ చిత్రం తీసుకెళుతుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు.

ఇక క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) కూడా ప్రభాస్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ కే.. కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)  చిత్రంతో  రాబోతున్నారు. పాన్ వరల్డ్ గా హాలీవుడ్ రేంజ్ లో నిర్మిస్తున్నారు. మే 10న విడుదల కానునన్న ఈ చిత్రం కూడా రూ.2 వేల కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు.మే 09 తేదీన ఈ సినిమా విడుదల కాకపోవడానికి కారణం.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరగబోతోన్న సార్వత్రిక ఎన్నికలతో (Elections) పాటు ఐపీఎల్ (IPL 2024) అని కూడా తెలుస్తోంది. అందుకే ఈ సినిమాను జూన్ 27కు మేకర్స్ వాయిదా వేశారు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone)  కూడా డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సరసన పాన్ వరల్డ్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈచిత్రం మే 10న విడుదల కాబోతోంది. 

2024-04-28T08:24:51Z dg43tfdfdgfd