KALKI 2898 AD : ‘కల్కి’పై నెగెటివ్ కామెంట్లు.. విరుచుకుపడ్డ విశ్వక్ సేన్

ప్రభాస్ కల్కి 2898 ఏడీ చిత్రం మీద ప్రస్తుతం నెగెటివ్ కామెంట్లు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కూడా సరైన ప్రమోషన్స్ చేయడం లేదని, కంటెంట్ కూడా సరిగ్గా వదలడం లేదని, టీజర్, ట్రైలర్ సరిపోలేదని, తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ భైరవ ఆంథమ్ కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదనే విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. కల్కి టీం మాత్రం బుజ్జితోనే ప్రమోషన్స్ చేస్తున్నారు. ముంబై, చెన్నై రోడ్ల మీద బుజ్జిని తిప్పుతూ కల్కి గురించి అందరికీ తెలిసేలా చేస్తున్నారు.

కల్కి గురించి బార్బెల్ అనే వ్యక్తి నెగెటివ్ కామెంట్లు చేశాడు. హాలీవుడ్ నుంచి రిఫరెన్సులు తీసుకుని చేసినట్టుగా ఉందని అన్నాడు. అయితే ఈ నెగెటివ్ కామెంట్ల మీద విశ్వక్ సేన్ మండి పడ్డాడు. తన ఇన్ స్టా స్టోరీలో అతగాడి వీడియో పెట్టి ఏకిపారేశాడు. ముందు ఓ పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీయ్ అంటూ ఛాలెంజ్ విసిరాడు.

సినిమా రిలీజ్ కూడా అవ్వకముందే చెంబు పట్టుకుని బయల్దేరుతున్నారు.. యూట్యూబ్‌లో మీ ఇన్ కమ్ కోసం.. వేల మంది కష్టపడి పని చేస్తున్న సినిమా ఇండస్ట్రీతో మజాక్‌లు అయ్యాయ్.. వీడు ఒక పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీస్తే చూద్దాం.. లేదంటే అడ్రస్ తప్పిపోయిన వాళ్లు అనుకుని ఇగ్నోర్ చేద్దాం.. ఇలా విమర్శలు చేసే వారంతా కూడా ఓ పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీయండి.. అని ఫైర్ అయ్యాడు విశ్వక్ సేన్.

మన చుట్టూ ఉన్న కొంత మంది పైరసీ కంటే డేంజర్.. సినిమా కోసం ఇక్కడ చిందించే రక్తం, చెమటను, ఎంతో మందికి జోవనోపాధిని ఇస్తున్న ఈ ఇండస్ట్రీని అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను.. అంటూ విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-06-18T12:36:02Z dg43tfdfdgfd