KALKI2898AD: ప్రభాస్ సినిమాలో మహేష్ బాబు.. ఆ పాత్ర కోసం!

Mahesh Babu in Kalki : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్నారు. అయితే ఎట్టకేలకు ఈ మధ్యనే సలార్ సినిమాతో ప్రభాస్ మంచి విజయం అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పార్ట్ 2 తో బిజీగా ఉన్న ప్రభాస్.. మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ అశ్విన్ దర్శకత్వంలో కల్కి2898AD అనే సినిమాతో త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు ఉన్నాయి. మే 9న విడుదల కావలసిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వల్ల జూన్ 27 కి పోస్ట్ పోన్ అయ్యింది.

కాగా సినిమా విడుదల ఆలస్యమైనప్పటికీ కల్కి సినిమా గురించిన ప్రతి అప్డేట్.. సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తూనేఉంది. ముఖ్యంగా భారీ క్యాస్ట్ తో.. భారీ బడ్జెట్ తో.. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆసక్తికి గురిచేస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరొక క్రేజీ అప్డేట్ ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ కి సైతం సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా ఒక మైథాలజికల్ ఫిక్షనల్ డ్రామా అని తెలిసిందే. అయితే ఈ సినిమాలో శ్రీ విష్ణువు పాత్ర కూడా ఉండబోతోంది. ఆ పాత్రకి స్వయంగా సూపర్ స్టార్ మహేష్ బాబు డబ్బింగ్ చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇక మహేష్ బాబు కూడా కలిగే సినిమాలో భాగం కాలన్నారు అని తెలిసి తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంతో సంబరపడిపోతున్నారు.

ప్రభాస్ సినిమాలో మహేష్ బాబు వాయిస్ వినడానికి ప్రభాస్, మహేష్ ఫ్యాన్స్ కూడా చాలా ఎక్సైట్ అవుతున్నారు. కాగా ఈ విషయం గురించి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇప్పటికే ఈ సినిమాలో అమితాబచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. దీపిక పడుకొనే.. దిశాపటాన్ని ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

వైజయంతి ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా జూన్ 27న ఆ విడుదల కి సిద్ధం అవుతుంది. నాగ అశ్విన్ కి మాత్రమే కాక ప్రభాస్ కి కూడా ఈ సినిమా అతిపెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ఇప్పటినుంచే జోస్యం చెబుతున్నారు. 

సినిమాకి సంబంధించిన ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరిగింది. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎంత ఆ పెద్ద హిట్ అందుకుంటారో వేచి చూడాలి. ఈ సినిమా కూడా అన్ని భాషల్లో విడుదలకి సిద్ధమవుతోంది.

Read More: WomanThrows Son: పసిబిడ్డను మొసళ్లకు ఆహరంగా వేసిన కసాయి తల్లి..కారణం ఏంటో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-05-08T05:57:58Z dg43tfdfdgfd