KANNAPPA: కన్నప్ప కోసం అక్షయ్ షాకింగ్ రెమ్యునరేషన్.. చిన్న పాత్ర కోసం మరీ అంతా?

Kannappa: కన్నప్ప కోసం అక్షయ్ షాకింగ్ రెమ్యునరేషన్.. చిన్న పాత్ర కోసం మరీ అంతా?

మంచు విష్ణు(Manchu Vishnu) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప(Kannappa). పరమశివుడి భక్తుడైన కన్నప్ప జీవిత కాదా ఆధారంగా వస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్(Mukesh kumar singh) తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో మంచు ఫ్యామిలీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక కాస్టింగ్ విషయంలో కన్నప్ప టీమ్ ఆడియన్స్ ను అవాక్కయ్యేలా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం దాదాపు అన్ని భాషల నుండి స్టార్స్ ని తీసుకున్నారు. 

వారిలో.. ప్రభాస్, నయనతార, మోహన్ లాల్. శివరాజ్ కుమార్ ఉన్నారు. తాజాగా ఈ లిస్టులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ చేరిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ముఖ్య పాత్ర కోసం ఆయనను సెలెక్ట్ చేశారట మేకర్స్. ఇటీవలే ఆయన పాత్రకు సంబందించిన షూట్ కూడా కంప్లీట్ చేశాడు అక్షయ్. అయితే.. తాజాగా ఈ సినిమా కోసం అక్షయ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో చాలా కీలకం కానున్న ఈ సినిమా కోసం అక్షయ్ ఏకంగా రూ.6 కోట్లు రెమ్యురేషన్ గా తీసుకున్నాడట. కేవలం 3 నుండి నాలుగు రోజుల కాల్ షీట్ కోసం ఈ రేంజ్ రెమ్యునరేషన్ అంటే మాములు విషయం కాదు అనే టాక్ నడుస్తోన్నది. 

అంతేకాదు.. కన్నప్ప సినిమాలో అక్షయ్ కుమార్ చేస్తున్న పాత్రపై కూడా ఆసక్తికర చర్చ నడుస్తోంది. అదేంటంటే.. ఈ సినిమాలో అక్షయ్ శివుడి పాత్రలో కనిపించనున్నాడట. ఇటీవల అక్షయ్ శివుడిగా కనిపించిన ఓ మై గాడ్ 2 మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఆ కారణంగానే కన్నప్ప సినిమా కోసం అక్షయ్ ని తీసుకున్నారట మేకర్స్. నిజానికి ఈ సినిమాలో శివుడి పాత్ర కోసం ప్రభాస్ అనుకున్న విషయం తెలిసిందే. దాంతో కన్నప్ప సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి. కానీ, కన్నప్ప టీమ్ తాజాగా తీసుకున్న డెసిషన్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న కన్నప్ప సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T05:00:27Z dg43tfdfdgfd