KANNAPPA: మంచు విష్ణు సినిమా కోసం అక్షయ్ కుమార్ రెమ్యూనరేషన్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Kannappa Budget: 2022లో జిన్నా అనే సినిమాతో మరొక ఫ్లాప్ అందుకున్న  మంచు విష్ణు దాదాపు రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు. కన్నప్ప అనే టైటిల్ తో త్వరలో విడుదలకాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మంచు మోహన్ బాబు స్వయంగా ఈ సినిమాని భారీబడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

కేవలం సినిమాని నిర్మించడం మాత్రమే కాక సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని మోహన్ బాబు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు అని సమాచారం. నిజానికి ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. సినిమాపై ఎవరికి ఆసక్తి కూడా రాలేదు. కానీ ఎప్పుడైతే ప్రభాస్ సినిమాలోకి అడుగుపెట్టారో ఇది పాన్ఇండియా రేంజ్ సినిమాగా మారిపోయింది.అప్పటినుంచి ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది. ఈ మైతాలాజికల్ ఫిక్షనల్ సినిమాలో ప్రభాస్ పరమశివుడి పాత్రలో క్యామియో రోల్ లో కనిపించబోతున్నారు. 

కృష్ణంరాజు నటించిన భక్త కన్నప్ప సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రాబోతుండడం, అందులో ప్రభాస్ కామియో రోల్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. సినిమాపై మరింత బజ్ ను క్రియేట్ చేశాయి. అయితే ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటారు అనే విషయం మీద క్లారిటీ లేదు. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం అక్షయ్ కుమార్ పది రోజులపాటు షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే కేవలం 10 రోజుల సినిమా షూటింగ్ కోసం కూడా అక్షయ్ కుమార్ కి చిత్రబృందం భారీగానే రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. అక్షయ్ కుమార్ ఈ సినిమా కోసం 6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. 

సౌత్ లో ఉన్న చాలా మంది స్టార్లు నటిస్తున్న ఈ సినిమా 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తెలుగు నుంచి మాత్రమే కాక తమిళ్ నుంచి శరత్ కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తున్నారు. మోహన్ బాబుతో పాటు బ్రహ్మానందం, మధుబాల, దేవరాజ్, ఐశ్వర్య తదితరులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. మరి ఈ మధ్య కాలంలో ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేని మంచు విష్ణు కెరియర్ ను ఈ సినిమా ఎంతవరకు మలుపు తిప్పుతుందో చూడాలి.

Read more: Snake Shed his Skin: బాప్ రే.. కుబుసం విడుస్తున్న పాము.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-05-05T11:25:00Z dg43tfdfdgfd