KARTHIKA DEEPAM 2 SERIAL TODAY APRIL 19TH: కార్తీకదీపం 2 సీరియల్: తల్లి ఆవేదన చూసి జ్యోత్స్న విషయంలో కార్తీక్‌ మనసు మార్చుకుంటాడా.. ఆ ఒక్క సాయం చేయమని దీప రిక్వెస్ట్!

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ బయటకు వెళ్లడానికి కారు దగ్గరకు వస్తే అక్కడ దీప కార్తీక్ సౌర్య కోసం కొన్న డ్రస్ పట్టుకొని నిల్చొని ఉంటుంది. కార్తీక్ దీపని చూసి మీరు ఏం అడగాలి అనుకుంటున్నారో నాకు అర్థమైంది దీప అని అంటాడు. దానికి దీప అయినా మీరు పాపకి బట్టలు కొన్నారు అని అంటుంది.

దీప: ఎందుకు మీరు పాపకు దగ్గర అవుతున్నారు.  ఎందుకు సౌర్య విషయంలో అంత చనువు తీసుకుంటున్నారు. సౌర్యతో స్నేహం చేయాల్సిన అవసరం మీకు ఏంటి. జాలి చూపిస్తున్నారా..

కార్తీక్: దాన్ని అభిమానం అనుకోవచ్చు కదా..

దీప: దానికి ఏమైనా కావాలి అంటే కొని ఇవ్వడానికి తల్లిగా నేను ఉన్నాను.

కార్తీక్: అలాగే ఫ్రెండ్‌గా నేను ఉన్నాను అనుకోవచ్చు కదా.. 

దీప: ఎందుకు అనుకోవాలి. మీ నీడను కూడా నేను భరించలేను. మీ దయా దాక్షణ్యాలు మాకు వద్దు అని మీరు కొన్ని ఈ డ్రస్ మీ ముఖాన విసిరి కొట్టాలి అనుకున్నాను. 

కార్తీక్: అలా కొడితే మీ కోపం తీరుతుంది అనుకుంటే భరించడానికి నేను సిద్ధం. దీప నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. సౌర్య చిన్నపిల్ల. తన వయసుకు కొన్ని ఆశలు ఉంటాయి. చిన్న చిన్న సంతోషాలు ఉంటాయి. 

దీప: అవన్నీ తీర్చడానికి మీరు ఎవరు..

కార్తీక్: మా అత్తని కాపాడటానికి నువ్వు ఎవరు. నువ్వు కాపాడటం వెనక ఏ దురుద్దేశం లేనప్పుడు నేను అవన్నీ కొనడం వెనుక ఏం లేదు..

దీప: మేం అవేవి కోరుకోవడం లేదు.

కార్తీక్: మా అత్త మాత్రం మీ నుంచి సాయం కోరుకుందా.. ఓ మనిషిని కాపాడటానికి వెనకా ముందు ఆలోచించకుండా ప్రాణం అడ్డుపెట్టారు. ఆ దేవుడి దయ వల్ల మీకు ఏం కాలేదు ఏమైనా అయి ఉంటే..

దీప: మా నాన్న దగ్గరకు వెళ్లిపోయేదాన్ని.

కార్తీక్: అప్పుడు రౌడీ పరిస్థితి ఏంటి. ఇవన్నీ మీరు ముందే ఆలోచించలేదు కదా.. 

దీప: మీరు మా పాపకు దగ్గర అవ్వడం నాకు ఇష్టం లేదు. ఈ చనువు ఈ ప్రేమలు మీ నుంచి నా బిడ్డ పొందడం నేను భరించలేను. దానికి తెలీదు కదా మీరు ఎంత మంచివాళ్లో.. మేం ఇక్కడ నుంచి వెళ్లిపోయే వరకైనా మమల్ని ఇలా వదిలేయండి.

కార్తీక్: దీప నేను షాపింగ్ మాల్‌లో అతన్ని చూశాను. సౌర్య కూడా చూసింది. 

దీప: మీరు సౌర్యకు ఏమైనా చెప్పారా..

కార్తీక్: కన్నతల్లి మీరే ఏం చెప్పనప్పుడు నేను ఎవరండీ చెప్పడానికి. ఆరేళ్ల కూతురికి తండ్రి గురించి చెప్పలేదు అంటే అది ఎంత పెద్ద కష్టమో అర్థమవుతుంది. కానీ ఎందుకో అర్థం కాలేదు. ఏం జరిగిందో తెలీడం లేదు. అతను మాట్లాడలేదు. నేను అడిగే ప్రయత్నం చేయలేదు. కనీసం మీరు అయినా ఏం జరిగిందో చెప్పండి. నాకు తోచిన సాయం చేస్తా..

దీప: నిజంగానే సాయం చేస్తారా.. అడిగిన తర్వాత కాదు అనకూడదు.

కార్తీక్: నాకు సాధ్యం కాకపోయినా చేస్తా.. ముందు మీరు అడగండి..

దీప: మీరు నా కూతురికి దూరంగా ఉండాలి. ఇదే మీ నుంచి నేను ఆశించే సాయం. ఇదొక్కటి చేయండి చాలు..

కార్తీక్: మనసులో.. నువ్వు అడిగిన సాయం నేను చేయలేను. ఈ సాయం మాత్రం నేను చేయలేను. చేయలేను..

మరోవైపు నర్శింహ భోజనానికి కూర్చొంటే శోభ అన్నం వడ్డించి అందులో ఉప్పు కారం డబ్బాలు తీసుకొని వచ్చి అన్నంలో వేసేస్తుంది. ఏమైందని నర్శింహ అడిగితే నీకు రోషం పౌరుషం తగ్గిందని అంటుంది. ఇక తన చేతి గాజులు తీసి ఇవి నువ్వు వేసుకోవాలో లేక నేను వేసుకోవాలో తేల్చుకో అది అయితే ఈ ఊరిలో ఉండటానికి వీల్లేదు అని సీరియస్‌గా ఉంటుంది. దీంతో నర్శింహ దీపను వదిలిపెట్టను అని రగిలిపోతాడు. 

మరోవైపు కాంచన కోడలు జ్యోత్స్న తీసుకొచ్చిన బట్టలు చూసి మురిసిపోతుంది. ఇక నువ్వు ఎందుకు తీసుకోలేదని అడిగితే కార్తీక్ తనకు నచ్చలేదు అని అంటాడు. ఇక జ్యోత్స్న తనకు ఇష్టం లేదు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పాలి అనుకుంటాడు. చెప్పబోతే తన తల్లి మాట్లాడనివ్వకుండా తాను చెప్తుంది.

కాంచన: నువ్వు వర్క్‌లో బిజీగా ఉండి నన్ను పట్టించుకోకపోయినా పర్లేదు కానీ జ్యోత్స్నను మర్చిపోకురా.. మా అన్నయ్యకు నేను అంటే ప్రాణం. ఆ ప్రేమ, ఆప్యాయత జీవితాంతం కావాలనే స్వార్థం నాకు ఉండేది. పెళ్లి అయ్యాక అన్నయ్య దూరం అయ్యాక అనిపించింది మా అన్నయ్యకు కూతురు పుడితే నా కోడలిగా ఆ ప్రేమలు తెచ్చుకోవాలి అనుకున్నా. పసుపు కుంకుమల కింద మా అన్నయ్య నాకు ఏం కావాలి అని అడిగితే పుడుతుందో లేదో తెలీక ముందే కూతుర్ని అడిగాను. ఇచ్చేశాడు.. జ్యోత్స్న మా అన్నయ్య కూతురు కాదురా నా కోడలు. తల్లిగా నేను నిన్ను అడిగేది ఒకటే నీ విషయంలో నాకోడలి కోరికను ఎప్పుడు కాదు అనకు. 

కార్తీక్: మనసులో ఇష్టాన్ని కాదు అన్నందుకే నువ్వు ఇలా అయిపోతే తనతో పెళ్లి వద్దు అంటే నువ్వు ఏమైపోతావో. నేను నిజం చెప్తే మీరు ఎంత బాధ పడతారో నాకు అర్థమైంది నేను చెప్పకూడదు పారుతోనే చెప్పించాలి. 

మరోవైపు సౌర్య కార్తీక్‌తో కొనిపించిన కలర్ పెన్సిల్స్‌తో పేపర్ మీద డ్రాయింగ్ వేస్తుంది. దీప సౌర్యని పిలిచి కార్తీక్‌ను ఏమీ అడగొద్దు అని ఏం కావాలి అన్నా తననే అడగమని చెప్తుంది. 

ఇక ఉదయం దీప ఇంటి ముందు రంగుల ముగ్గు వేస్తుంది. దీప దగ్గరకు సౌర్య వచ్చి ముద్దు పెట్టి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని చెప్తుంది. ఇక పేపర్ మీద తల్లీ కూతుళ్ల డ్రాయింగ్ ఇచ్చి గిఫ్ట్ అని చెప్తుంది. ఇంతలో కార్తీక్ వస్తే ఈ రోజు దీప పుట్టిన రోజు అని అది తన అమ్మకు తాను ఇచ్చిన గిఫ్ట్ అని చెప్తుంది.  అందులో నాన్న అని గాలిపటం మీద రాస్తుంది. అది చూసిన కార్తీక్ చాలా బాగుంది అని అంటాడు. దీప సౌర్యను ప్రేమగా ముద్దు పెట్టుకుంటుంది. ఆ డ్రాయింగ్‌ను చూసిన దీప నాన్న అన్న పేరు మీద రంగు వేసి ఇక ఇది మన జీవితంలో ఉండదు అని అనుకుంటుంది. 

మరోవైపు సౌర్య పువ్వులు కోయడానికి వస్తే బంటు అడ్డుకుంటాడు. ఇక సౌర్య ఆ విషయం తన తల్లికి చెప్తుంది. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తవుతుంది.  

Also Read: త్రినయని సీరియల్: సుమన నటనకు గాల్లో ఉసిరి దీపాలు.. తొలిబిడ్డ జాడ నయనికి తెలిసిపోతుందా..!

2024-04-19T03:36:17Z dg43tfdfdgfd