KRISHNA MUKUNDA MURARI SERIAL TODAY APRIL 17TH: కృష్ణ ముకుంద మురారి సీరియల్: డాక్టర్‌ని కలిసి మాస్టర్ ప్లాన్ వేసేసిన ముకుంద.. త్వరలోనే బిడ్డనిస్తానని భవానికి మాటిచ్చిన కృష్ణ!

Krishna Mukunda Murari Today Episode ఆదర్శ్ గురించి రేవతికి చెప్తుకొని బాధ పడిన భవాని కృష్ణ మురారిల మీదే తన ఆశలు అన్నీ అని చెప్తుంది. ఇంతలో కృష్ణ, మురారిలు చేతిలో ఓ బిడ్డను ఎత్తుకొని వచ్చినట్లు కలలు కంటుంది. కృష్ణ దగ్గరకు వెళ్లి ప్రేమగా చూస్తుంది. కృష్ణ ఏమైంది అత్తయ్య అని అడగడంతో రియాలిటీలోకి వచ్చి బాధ పడుతుంది. ముకుంద మీద నుంచి వీళ్ల మాటలు వింటుంది. 

భవాని: ఏం లేదు మీరిద్దరూ ఓ చిట్టి పాపాయ్‌ని ఎత్తుకొని వచ్చినట్లు అనిపించింది. ఆ బిడ్డని అలా ఎత్తుకొని వచ్చి నా చేతిలో పెడతావ్ అని లేచానా అంతలో అర్థమైంది అదంతా నా ఊహ అని. నా ఊహ నిజం అవుతుందా.. లేక ఎప్పటిలాగానే ఊహల్లో బతికేయాలా..

కృష్ణ: నిజం అవుతుంది పెద్దత్తయ్య మీ కోరిక తొందర్లోనే నెరవేరుస్తాను. అయినా తప్పు అంతా నాదే పెద్దత్తయ్య.. మీ కోసం ఆలోచించుకోండి అని మీరు ఎంత చెప్పినా వినకుండా ముకుంద గురించి ఆలోచించాను. రేవతితో.. ఏంటి అత్తయ్య మీరు పెద్దత్తయ్యతో చెప్పలేదా..

రేవతి: ఏ విషయమే..

కృష్ణ: పనికిమాలిన విషయాలు అన్నీ చెప్తారు. ఈ విషయం చెప్పలేదా.. అని సిగ్గుపడుతుంది. పాపం పెద్దత్తయ్య చూడండి ఇంటికి పిల్లలు ఎప్పుడు వస్తారు అని ఎదురు చూస్తున్నారు. 

రేవతి: ఏయ్ తింగరి నువ్వు నాకు ఏం చెప్పావే.. నేను అక్కతో ఏం చెప్పలేదే..

కృష్ణ: అదే అత్తయ్య ఇది ఏప్రిల్ కదా తొమ్మిది నెలలు అంటే జనవరి కల్లా ఈ ఇంటికి బుజ్జి పాపాయి వస్తుందని చెప్పా కదా. మరి ఆ విషయం పెద్దత్తయ్యకు చెప్పాలి కదా.

రేవతి: ఓసినీ నేను ఇంకేంటో అని కంగారు పడిపోయానే. అయినా నేను చెప్పడం ఏంటి నువ్వే మాటివ్వు అంటే కృష్ణ భవాని చేతిలో చేయి వేసి మాటిస్తుంది. అది చూసిన ముకుంద కోపంతో రగిలిపోతుంది. 

ఇంతలో మధు వచ్చి మంచి సీన్ ఫొటో తీస్తా అంటాడు. దానికి మురారి మళ్లీ ఇచ్చిన మాట కృష్ణ మర్చిపోతుంది అనా ఫొటో తీసుంటే చూపించి గుర్తు చేయొచ్చు అనుకుంటున్నావా అని అంటాడు. 

ముకుంద: తనలో తాను.. ఇద్దరూ ఒక్కటైపోయారు అని ఎంత కాన్ఫిడెంట్‌గా మాట ఇచ్చేస్తున్నావే కృష్ణ. పిల్లల్ని కనడం కాదు కదా నీ కడుపులో బిడ్డ పడింది అన్న సంతోషం కూడా ఉంచను. మురారికి పిల్లలు అంటూ ఉంటే అది నాతోనే. దీన్ని ఎవరూ మార్చలేరు.  

మరోవైపు ముకుంద బయట వైదేహి అనే డాక్టర్‌ని రహస్యంగా కలుస్తుంది. ఆ డాక్టర్ తప్పు ఒప్పు అని మాట్లాడితే.. చెప్పింది చేస్తావా లేదా అని ముకుంద అంటుంది. దీంతో డాక్టర్ చేస్తాను అని మాట ఇచ్చాను కదా చేస్తాను కానీ ఇలా కలవడం ఎందుకు అని అనుకుంటున్నా. 

ముకుంద: నిజం బయట పడితే నాతో పాటు నువ్వు కూడా దొరికిపోతావని భయమా.. నేను ముకుంద అని నా అంతట నేను.. నిజం తెలిసిన నువ్వు చెప్తేనే తప్ప ఎవరికి తెలిసే ఛాన్స్ లేదు.

వైదేహి: సరే ఇప్పుడు ఎందుకు కలవమని చెప్పావో చెప్పు.

ముకుంద: వైదేహి ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం వచ్చేసింది. నా అవసరం నీకు చిరాకు తెప్పించొచ్చు కానీ ఇది నా ప్రేమ. నా జీవితం. నా కోరిక.. నా ధ్యాస.. ఇవన్నీ నెరవేరాలి అంటే కృష్ణ ఎట్టి పరిస్థితుల్లో తల్లి కాకూడదు. దానికి నువ్వు అని ప్లాన్ చెప్తుంది. ఇదీ విషయం అర్థమైంది కదా. ఎప్పుడు ఏ పొరపాటు జరగకూడదు. 

వైదేహి: కచ్చితంగా చేయాల్సిందేనా.. ఇంకొసారి ఆలోచించు ముకుంద.

ముకుంద: ఆలోచించడం ఏం లేదు. జరిగి తీరాల్సిందే.. ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణ తల్లి కాకూడదు. 

మరోవైపు రూమ్‌లో మురారి సీరియస్‌గా ఆలోచిస్తాడు. ఏంటి అంత సీరియస్‌గా ఆలోచిస్తున్నారు అని అడిగితే మురారి పుట్టబోయే బిడ్డకు ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తున్నాను అంటాడు. దానికి కృష్ణ ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని అంటుంది. దానికి మురారి తండ్రి కాబోతున్నాను అని ఆలోచినే ఉక్కిరి బిక్కిరి చేస్తుంది చాలా సంతోషంగా ఉందని అంటాడు. కృష్ణ అయితే తనకు పెద్దత్తయ్య కోరిక తీర్చడం చాలా అవసరం అనిపిస్తుందని ఆవిడ అన్ని ఆశలు మన మీదే పెట్టుకున్నారని అంటుంది. ఇక కృష్ణ ఆదర్శ్‌ గురించి కూడా ఆలోచించాలి అంటే మురారి అడ్డుకుంటాడు. 

మరోవైపు ఆదర్శ్‌ రెడీ అయి ముకుంద కోసం వెతుకుతాడు. రజినీ కనిపిస్తే అత్తయ్య ముకుంద కనిపించిదా అని అడుగుతాడు. దానికి రజినీ మనసులో బంగారం లాంటి నా కూతుర్ని వదిలేసి ఆ ముకుంద గురించి అడుగుతాడు ఏంటి అని తిట్టుకుంటుంది. 

  

రజిని: అయినా ఇప్పుడు నీకు ముకుందతో ఏం పని..

ఆదర్శ్‌: అది నీకు అనవసరం అత్తయ్య. అడిగిన దానికి సమాధానం చెప్పు. ముకుందని చూశావా.. 

రజిని: ఏమో ఆవిడ ఎక్కడుందో నాకు ఏం తెలుసు..

ఆదర్శ్‌: అమ్మా ముకుందని చూశావా..

భవాని: లేదురా నేను చూడలేదు. అయినా నీకు ముకుందతో ఏం పని.. అదిగో వస్తుంది కదా.. 

రజిని: ఆ రామ్మా నీ కోసం తెగ వెతికేస్తున్నాడు ముకుంద ఎక్కడ ముకుంద ఎక్కడ. 

ఆదర్శ్‌:  ఎక్కడికి వెళ్లావ్ ముకుంద.

ముకుంద: కొంపతీసి వీడికి అనుమానం వచ్చిందా ఏంటి. లేదంటే డాక్టర్‌తో మాట్లాడటం చూసేశాడా.. ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్లాను.

ఆదర్శ్‌:  ఇప్పుడెందుకు వెళ్లావ్ బయట ఎండలు ఎలా ఉన్నాయో చూశావా.. సాయంత్రమో వెళ్లొచ్చు కదా.

ముకుంద: మనసులో.. వీడి ప్రేమ తగలెయ్య.. ఇంకా నేను ఎక్కడ దొరికిపోయానో అని భయపడి చచ్చా.. అది ఈవినింగ్ కలుద్దామనుకున్నా కానీ తనకు వేరే పని ఉంది అంటే వెళ్లొచ్చా.

మురారి: అంత అర్జెంట్ అంటే ఆదర్శ్‌కి చెప్పొచ్చు కదా ఇద్దరూ కారులో వెళ్లి వచ్చేవాళ్లు. ఎండలో వెళ్లడం ఎందుకు అని వీడి బాధ. అంతే కదరా..ఇక ముకుంద మురారి ఒకర్ని చూసి ఒకరు నవ్వుకుంటారు. అది కృష్ణ చూసి జలస్‌ ఫీలవుతుంది. మురారి వంక సీరియస్‌గా చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: నవ్వులు పూయిస్తున్న కార్తీక్, రౌడీల కాంబో.. కార్తీక్‌కు పర్మిషన్ ఇచ్చిన దీప, ఇదేనా తండ్రి ప్రేమంటే!

2024-04-17T04:35:10Z dg43tfdfdgfd