KUBERA: శేఖర్ కమ్ముల సినిమాలో నాగార్జున పాత్ర.. ఎన్నో సంవత్సరాల తరువాత మళ్లీ అలా!

Nagarjuna Role in Kubera : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజాగా ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే ఆ సినిమాతో చేస్తున్న సంగతి తెలిసిందే. క్యామియో పాత్ర అయినప్పటికీ ఈ సినిమాలో కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. దాదాపు ఈ సినిమా ఒక మల్టీస్టారర్ లానే ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. 

చాలాకాలం తర్వాత ఈ సినిమాలో నాగార్జున ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాలో నాగార్జున పాత్రకి విభిన్నమైన షేడ్స్ ఉంటాయట. చేతిలో ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితి నుంచి వందల వేల కోట్లు ఉన్న కుబేరతో నాగ్ పాత్ర ఏం చేస్తుంది అనేది సినిమాలో చూడాలి. 

గతంలో నాగార్జున 7 సార్లు పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. అందులో శివమణి, ఆవిడ మా ఆవిడే సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. మళ్ళీ ఇన్నాళ్లకు నాగార్జున ని కాకి దుస్తుల్లో చూడడానికి అభిమానులు చాలా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాతో నాగార్జున హిట్ అందుకుంటారో లేదో చూడాలి. 

స్టార్ బ్యూటీ రష్మిక మందన్న ఈ సినిమాలో ధనుష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ సినిమాలో నాగార్జున పాత్రకి జంటగా ఎవరైనా హీరోయిన్ నటిస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఏడాది ఈ సినిమా విడుదల కి సిద్ధం అవుతుంది.

ఇంకా అధికారిక రిలీజ్ డేట్ విడుదల చేయాల్సింది. అయితే ఒకవేళ ఈ సినిమాని ఈ ఎడాది విడుదల చేయలేకపోతే చిత్ర బృందం ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపాలని అనుకుంటుందట. ఇప్పటికే సంక్రాంతి బరిలో విశ్వంభర, రవితేజ, సీతా రామం సినిమా వంటివి ఎన్నో లైన్లో ఉన్నాయి. మరి కుబేర సినిమా వీటన్నిటిని దాటుకొని వేరే సమయంలో విడుదలవుతుందా లేక భారీ కాంపిటేషన్ మధ్య సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకి వస్తుందా అని వేచి చూడాలి.

Also read: Pink Mooon: ఆకాశంలో అద్భుతం, తెల్లవారుజామునే పింక్ మూన్, ఎన్ని గంటలకంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2024-04-25T08:45:03Z dg43tfdfdgfd