LAKSHMI RAI: బికినీలో రచ్చలేపుతున్న లక్ష్మీరాయ్.. ఫొటోస్ వైరల్

Lakshmi Rai: బికినీలో రచ్చలేపుతున్న లక్ష్మీరాయ్.. ఫొటోస్ వైరల్

కాంచమాల కేబుల్ టీవీ’సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భామ లక్ష్మీరాయ్. ఈ సినిమాలో శ్రీకాంత్ సరసన నటించిందీ ముద్దుగుమ్మ . తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.  తరువాత, రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన "కంచన" సినిమాలో ఆమె చేసిన పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో, ఆమె దక్షిణ భారత సినీ పరిశ్రమలో బిజీబిజీగా మెరిసిపోయింది.

సౌత్ పెద్ద సినిమాల్లో తనకంటూ మంచి గుర్తింపు పొందలేకపోయినా, ఐటెం సాంగ్స్ తో  అదరగొట్టింది. “రత్తాలు” అనే పాట ద్వారా ఫేమ్ అయ్యింది. లక్ష్మీ రాయ్ సినిమా కెరీర్‌కి వచ్చిన విపరీతమైన క్రేజ్ తో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. అయితే బాలీవుడ్ లో కూడా కొన్ని డిఫరెంట్ సినిమాలు చేసినా, అక్కడ కూడా ఆశించిన స్థాయి గుర్తింపు అందుకోలేకపోయింది. సోషల్ మీడియాలో బిజీగా ఉండే ఈ అమ్మడికి ఇన్ స్టాలో భారీగా ఫాలోవర్స్ ఉన్నారు.

తాజాగా మరోసారి డిఫరెంట్ బికినీలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోతో మరింత ట్రెండింగ్ అవుతోంది. పూల్ పక్కన తీసిన ఈ ఫోటోలో, ఆమె స్టైలిష్ గాగుల్స్ తో తన అందాన్ని మరింత హైలెట్ చేయడం విశేషం. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ప్రభుదేవాతో కలిసి ఒక సినిమాలో నటిస్తోంది.

©️ VIL Media Pvt Ltd.

2024-07-03T12:19:49Z dg43tfdfdgfd