LOW BUDGET MOVIES: కంటెంట్ చూసి నమ్మేయాలి డ్యూడ్.. తక్కువ బడ్జెట్‌లో భారీ కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!

Low Budget Huge Hit Movies: ప్రస్తుతం తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత సాధిస్తున్నాయి. అయితే భారీ బడ్జెట్ పెట్టి భారీ లాభాలు తెచ్చుకోవడంలో అంతగా మజా ఉండదు, ఒక నిర్మాత నిజంగా విపరీతంగా సంతోషపడాలి అంటే.. ఒక సినిమా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి..ఎక్కువ లాభాలు తెచ్చుకున్నప్పుడే అది సాధ్యం. ఇదే రుజువు చేస్తూ ఈ మధ్య వచ్చిన ఎన్నో చిన్న సినిమాలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి.. నిర్మాతలను తెగ ఖుషి చేశాయి.. మరి ఆ సినిమాలు ఒకసారి చూసేద్దాం..

సీతా రామం సినిమా బడ్జెట్ 25 కోట్లు

వరల్డ్ వైడ్ గ్రాస్: 91+ కోట్లు

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన సీతా రామం  సినిమా తెలుగు ప్రేక్షకుల మదిలో ఒక అందమైన ప్రేమ కథ చిత్రంగా మిగిలిపోయింది. 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా 91 కోట్లకు పైగా వసూలు చేసింది

కార్తికేయ 2 మూవీ బడ్జెట్ రూ. 15 కోట్లు

వరల్డ్ వైడ్ గ్రాస్: రూ. 125+ కోట్లు

నిఖిల్ హీరోగా సెన్సేషనల్ విజయం సాధించిన పాన్-ఇండియన్ చిత్రం కార్తికేయ 2. బాలీవుడ్లో సైతం సూపర్ హిట్ గా నిర్వచించిన ఈ సినిమా 15 కోట్ల పెట్టుబడి పెట్టగా దాదాపు 120 కోట్ల పైన కలెక్షన్ సాధించింది.

కాంతారా సినిమా బడ్జెట్ 16 కోట్లు

వరల్డ్ వైడ్ గ్రాస్: 406 Cr

తక్కువ బడ్జెట్ తో వచ్చి ఎక్కువ లాభాలు తెచ్చుకున్న సినిమా అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు కాంతారా. 16 కోట్ల బడ్జెట్‌తో రిషబ్ శెట్టి నటించిన కాంతారా సెన్సేషనల్ విజయం సాధించి.. బాక్సాఫీస్ వద్ద రూ.400+ కోట్లు వసూలు చేసింది.

డీజే టిల్లు మూవీ బడ్జెట్ రూ.7-8 కోట్లు

వరల్డ్ వైడ్ గ్రాస్: 30+ కోట్లు

సిద్దు జొన్నలగడ్డ,‌ నేహా శెట్టి నటించిన Dj Tillu సినిమా కేవలం రూ. 7-8 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడింది. అయితే ఈ సినిమా 30+ కోట్లు వసూలు చేసింది. ఇక ఈ సినిమా సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా మంచి కలెక్షన్స్ సాధించింది.

777 చార్లీ మూవీ బడ్జెట్ రూ. 15-20 కోట్లు

ప్రపంచవ్యాప్త గ్రాస్: 100+ కోట్లు

రక్షిత్ శెట్టి నటించిన చార్లీ 777 అన్ని భాషలలోనూ మంచి విజయం సాధించింది. డ్రామా అభిమానులను కంటతడి పెట్టించింది. కేవలం 15 నుంచి 20 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం ఏకంగా 100 కోట్ల కలెక్షన్లు సాధించింది.

లవ్ టుడే బడ్జెట్: రూ. 5 కోట్లు

వరల్డ్ వైడ్ గ్రాస్: 70 కోట్లు

తెలుగు ప్రేక్షకులను సైతం ఎంతగానో అలరించిన ఈ తమిళ సినిమా కేవలం ఐదు కోట్ల బడ్జెట్ తో రాగా ఏకంగా 70 కోట్ల పైగా కలెక్షన్ సాధించింది.

Read More: Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?

Read More: Sai Pallavi Dance: షీలా.. షీలా కి జవానీ పాటకు మెస్మరైజింగ్ స్టెప్పులు వేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

2024-04-20T10:43:53Z dg43tfdfdgfd