MAHARASHTRA: యూట్యూట్‌ నటుడు నిర్వాకం.. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోకి దూసుకెళ్లడంతో కలకలం

YouTube Actor: వాహనదారులకు టోల్‌ చార్జీలు మోయలేని భారంగా మారుతున్నాయి. చార్జీలు పెరుగుతుండడంతో ప్రయాణం కన్నా టోల్‌ చార్జీకే అధికంగా చెల్లించాల్సి వస్తుండడంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టోల్‌ చార్జి భరించలేక ఓ యువకుడు అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తాను వెళ్తున్న సమయంలో ముఖ్యమంత్రి కాన్వాయ్‌ రాగా అందులో తన కారును దూరించాడు. సీఎం కాన్వాయ్‌లోకి వెళ్తే టోల్‌ చెల్లించాల్సిన అవసరం లేదని భావించాడు. అయితే కాన్వాయ్‌లోకి గుర్తు తెలియని కారు చేరడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే ఆ కారును అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Also Read: Bulandshahr: పాముకాటుతో మృతి.. బతుకుతాడనే ఆశతో మృతదేహాన్ని నదిలో ముంచిన కుటుంబం

 

ఈనెల 6వ తేదీన థానె నుంచి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తన అధికార నివాసానికి వెళ్తున్నారు. ఈ సమయంలో ఓ యువకుడు తన కారును ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోకి చేర్చాడు. ముంబైలోని బాంద్రా ర్లీ సీలింక్‌ వద్ద ఉన్న టోల్‌ప్లాజా వద్ద కాన్వాయ్‌లోకి ఓ కారు వచ్చి చేరింది. ట్రాఫిక్‌ పోలీసులు నిలువరిస్తున్నా పట్టించుకోకుండా టోల్‌ప్లాజా వద్ద వీఐపీ లేన్‌లోకి కారు వచ్చింది. వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది ఆ కారును అదుపులోకి తీసుకుంది. కారు నడుపుతున్న వ్యక్తిని అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టగా విస్తుగొలిపే విషయం బయటపడింది.

Also Read: Light Beers: తాగుబోతుల పాలిట దేవుడయ్య నువ్వు.. లైట్‌ బీర్ల 'హీరో'కు ఘన సన్మానం

 

ముంబైకి చెందిన శుభమ్‌ కుమార్‌ అనే యువకుడు సోషల్‌ మీడియాలో వీడియోలు చేస్తుంటాడు. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్నాడు. తన కారులో వెళ్తున్న సమయంలో ముఖ్యమంత్రి కాన్వాయ్‌ కనిపించింది. వెళ్లే మార్గంలో ఉన్న టోల్‌ గేట్‌ వద్ద చార్జీని తప్పించుకోవాలని చూశాడు. దీంతో వెంటనే ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోకి తన కారును పోనిచ్చాడు. సీఎం కాన్వాయ్‌కు ఎలాంటి టోల్‌ ఫీజు ఉండదని భావించి కాన్వాయ్‌లోకి వెళ్లాడు. అంతే కానీ ఎలాంటి దురుద్దేశం లేదని పేర్కొన్నాడు. శుభమ్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-05-09T09:43:53Z dg43tfdfdgfd