MAHESH BABU: ఫ్యాన్స్ ను భయపెట్టే నిర్ణయం తీసుకున్న మహేష్ బాబు.. వద్దు బాబోయ్ అంటున్న అభిమానులు..

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ యేడాడి గుంటూరు కారం సినిమాతో పలకరించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాకు ఓ మోస్తరు టాక్ తో దాదాపు రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంక్రాంతి బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. ఈ సినిమా తర్వాత రాజమౌళితో నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడు. అంతేకాదు ఈ సినిమా కోసం మహేష్ బాబు పూర్తిగా మేకోవర్ అయ్యాడు. జుట్టు పెంచి సరికొత్తగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం ప్రత్యకంగా ట్రైయిన్   కూడా అవుతున్నాడు. ఈ సినిమాను ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా అధికారంగా ప్రకటించనున్నారు. అంతేకాదు అదే రోజు ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ బాబుతో ఇతర నటీనటుల ఎంపిక పూర్తి కాలేదు. త్వరలోనే ఇందులో నటించబోయే నటీనటులను అనౌన్స్ చేసి.. ఒక నెల రోజులు పాటు టెస్ట్ షూట్స్ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుంది.

రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో కేవలం తెలుగు నటీనటులతో పాటు హిందీ, హాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటీనటులు ఇందులో భాగం అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు క్యాస్టింగ్ కు సంబంధించిన ఆడిషన్స్ జరగుతున్నాయి. అయితే.. రాజమౌళి సినిమా కోసం దాదాపు మూడేళ్ల త్యాగం చేయనున్నారు మహేష్ బాబు. అందుకే రాజమౌళి సినిమా ఫినిష్ అయిన వెంటనే పలువురు దర్శకులను కథలతో రెడీ ఉండమని చెప్పాడట.

ఇప్పటికే సుకుమార్, కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగ లు లైన్ లో ఉన్నారు. అయితే అనూహ్యంగా మహేష్ బాబు తన 30వ చిత్రాన్ని

త్రివిక్రమ్ తో చేయాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. గుంటూరు కారం సినిమా ఓ మోస్తరుగా నడిచినా.. అభిమానులను మాత్రం నిరాశ పరిచింది. కానీ మహేష్ బాబు.. త్రివిక్రమ్ చెప్పిన లైన్ నచ్చడంతో ఈ సినిమా పూర్తి కథను రెడీ చేయమని చెప్పినట్టు సమాచారం. ఒకవైపు అల్లు అర్జున్ సినిమాతో పాటు మహేష్ బాబు సినిమాల కోసం త్రివిక్రమ్ కథలను రెడీ చేసే పనిలో పడినట్టు సమాచారం. ఏది ఏమైనా గుంటూరు కారం సినిమా థియేటర్స్ లో అలరించలేకపోయినా.. ఓటీటీలో అదరగొట్టేసింది. ఏది ఏమైనా మహేష్ బాబు త్రివిక్రమ్ అంటే బ్యాడ్ సెంటిమెంట్ గుర్తుకు వచ్చి .. ఆయనతో సినిమా చేయెద్దంటూ అభిమానులు రిక్వెస్ట్ పెడుతున్నారు. మరి ఫ్యాన్స్ కోరికను మహేష్ బాబు పట్టించుకుంటారా.. లేదా అనేది చూడాలి.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-06-18T06:45:08Z dg43tfdfdgfd