టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఊహించని ఘటన ఎదురైంది. ఆయన సోదరి మంజుల.. ఉన్నట్టుండి మహేష్ బాబు జుట్టు పట్టుకొని లాగారు. ఇది మహేష్ బాబు అస్సలు ఊహించని పరిణామం. సడెన్‌గా తన ఆమె అలా చేసే సరికి... అక్కడున్న వారంతా ఆశ్చర్యంగా చూశారు. ఐతే.. ఇదంతా సరదాగా చేసినదే.
హైదరాబాద్ లోని ఓ పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్లిన మహేష్ బాబు దగ్గరకు వచ్చిన మంజుల.. సడెన్‌గా తల వెనక చెయ్యి పెట్టి.. జులపాల జుట్టును మెల్లగా లాగారు. దాంతో మహేష్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూడాలి.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జుట్టు లాగిన తర్వాత.. మంజుల పగలబడి నవ్వారు, మహేష్ కూడా నవ్వేశారు. దాంతో అక్కడున్న వారంతా.. నవ్వేశారు.
ఆ వీడియోని ఇక్కడ చూడండి
ప్రస్తుతం మహేష్ బాబు.. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న సినిమా కోసం.. ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు. అందుకోసమే జుట్టు పెంచుతున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. చాలా కాలం తర్వాత మహేష్ ఎక్కువ హెయిర్‌తో కనిపించే సరికి.. మంజుల ఇలా టీజ్ చేశారు.
2024-04-29T09:03:11Z dg43tfdfdgfd