MAMITHA BAIJU: ఐశ్వర్య రాయ్ నన్నారే సాంగ్కి మమితా డ్యాన్స్ వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Mamitha Baiju: ఐశ్వర్య రాయ్ నన్నారే సాంగ్కి మమితా డ్యాన్స్ వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

నెల్సన్ కే గఫూర్, మమితా బజు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ఫీల్ గుడ్ మూవీ ప్రేమలు. లవ్ కామెడీ జోనర్లో వచ్చి మలయాళ యూత్నే కాదు..తెలుగు ఆడియన్స్ను కూడా ఇంప్రెస్ చేసింది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోస్కు తెగ ఫిదా అవుతున్నారు యూత్. ముఖ్యంగా ఇందులో మమితా బజు హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకుంది. 

ప్రస్తుతం మమిత బైజు(Mamitha Baiju)సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ప్రేమలు రిలీజ్ తరువాత ఆమె ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. అంతేకాదు చాలా మంది కుర్రాళ్ళకి లేటెస్ట్ క్రష్ లిస్టులోకి కూడా చేరిపోయింది.

ప్రేమలు సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇటీవల ఈ అమ్మడుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియోలో మమితా ఏదో స్పెషల్ ఈవెంట్ లో డాన్స్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వీడియోలో మాత్రం ఈమె ఎనర్జీకి, ఆ డ్యాన్స్ స్వాగ్ కి, తన క్యూట్ మెస్మరైజింగ్ స్టెప్పులకి కుర్రకారు ఫిదా అవుతున్నారు. 

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ డ్యాన్స్ చేసిన నన్నారే..నన్నారే సాంగ్ కి మమితా అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులు వేసి అలరించింది. ఐశ్వర్యను మరిపించేంతగా..మామితా తనదైన స్టెప్పులతో ఆకట్టుకుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో తన ఫ్యాన్స్ కూడా తెగ షేర్ చేస్తున్నారు.ఇంకా ఆలస్యం ఎందుకు తన డ్యాన్స్ ఎంత అద్భుతంగా ఉందో..మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి.

©️ VIL Media Pvt Ltd.

2024-04-17T05:44:34Z dg43tfdfdgfd