MLC KAVITHA : లిక్కర్ కేసులో మళ్లీ నిరాశే..! ఎమ్మెల్సీ క‌విత క‌స్ట‌డీ గడువు పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. ఆమె జ్యుడిషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఆమెతో పాటు ఈ కేసులో ఉన్న ఆప్ నేత మనిష్ సిసోడియా కస్టడీని జులై 25వ తేదీకి పొడిగిస్తూ బుధవారం రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది.

గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ గడువు  తేదీతో ముగియడంతో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను కోర్టు ముందు హాజరుపరిచారు. ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా… కస్టడి గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జులై 25వ తేదీ వరకు కవిత తీహార్ జైలులోనే ఉండనున్నారు.

దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ ను ఇటీవలే ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.

సీబీఐ అవినీతి కేసు, ఈడీ మనీలాండరింగ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ ట్రయల్ కోర్టు మే 6న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ  కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కవిత తరపున న్యాయవాదనలను తిరస్కరించిన హైకోర్టు.. జులై ఒకటో తేదీన బెయిల్ పిటిషన్  ను కొట్టివేసింది. సీబీఐ, ఈడీ వాదనలతో న్యాయస్థానం ఏకీభవిస్తూ బెయిల్‌ను ఇవ్వలేమని చెప్పింది. హైకోర్టు బెయిల్‌ తిరస్కరించిన నేపథ్యంలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది.

2024-07-03T08:34:53Z dg43tfdfdgfd