NAGA PANCHAMI SERIAL TODAY MAY 10TH: 'నాగ పంచమి' సీరియల్: జ్వాల గర్భంలో గరుడ అంశ ఉందని తెలుసుకున్న నాగేశ్వరి.. జ్వాలని చూసి గజగజ వణికిపోయిన పంచమి!

Naga Panchami Today Episode పంచమి, మోక్ష మాట్లాడుకుంటారు. తన ప్రాణాలు నువ్వు పెట్టిన భిక్షే అని మోక్ష పంచమితో అంటాడు. దాంతో పంచమి అలా అనొద్దని తన భర్తని కాపాడుకోవడం తన కర్తవ్యమని అంటుంది. జరిగిన వన్నీ ఓ తీపి జ్ఞాపకాలుగా ఉంచుకుందామని ఇకపై సంతోషంగా కలిసిమెలసి ఉందామని మోక్ష పంచమితో అంటాడు. ఇక కరాళి దగ్గరకు నాగేశ్వరి వస్తుంది. 

నాగేశ్వరి: కరాళి ఎన్ని సార్లు చెప్పినా నువ్వు నీ రాతని మార్చుకోవడం లేదు. కోరి కోరి చావుని కొని తెచ్చుకుంటున్నావ్. 

కరాళి: నన్ను చంపేంత శక్తి నీకు లేదు నాగేశ్వరి నువ్వు నన్ను ఏం చేయలేవు.

నాగేశ్వరి: నేను తలచుకున్నా మా నాగదేవత తలచుకున్నా నిన్ను చంపడం అంత కష్టతరం కాదు. మా ఇష్టరూప జాతికి కొన్ని నియమాలు ఉన్నాయి. మా మహారాణిని మీ అన్న పొట్టన పెట్టుకున్నాడు. మీ వంశం మొత్తం మా మహారాణి వంశం చేతిలోనే చావాలి. అందుకే మీ అన్న నంబూద్రీని మా యువరాణి పంచమి చంపింది.

కరాళి: మా అన్నని చంపినందుకే ఇప్పుడు పంచమి ముప్పు తిప్పలు పడుతుంది. పంచమిని సంతోషంగా ఉండనివ్వను. 

నాగేశ్వరి: మా యువరాణి ఇంకా పాముగా మారలేదు కాబట్టే నువ్వు ఇంకా ప్రాణాలతో ఉన్నావు. కానీ తనకు పుట్టబోయే బిడ్డకు ఇష్టరూప శక్తులు ఉంటాయి. 

కరాళి: తన బిడ్డను గర్భం దాటి బయటకు రానివ్వను. నేను మీ నాగలోకం మొత్తాన్ని నాశనం చేయకుండా నిద్రపోను. 

నాగేశ్వరి: నిన్ను నువ్వు చాలా ఎక్కువ అంచనా వేసుకుంటున్నావు కరాళి. నీకు అంత శక్తి  లేదు.

కరాళి: నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావ్ నాగేశ్వరి. నీ ఊహకు కూడా అందని ప్రయోగం చేశాను. మీ జాతి యువరాజు ఫణేంద్రను మీకు శత్రువుగా మార్చి నా శక్తిగా మార్చుకున్నాను. మీ నాగజాతికి ఆగర్భ శత్రువులైన గరుడ రాజు సాయంతో ఫణేంద్రలో గరుడ శక్తిని ప్రవేశపెట్టి జ్వాల కడుపులో ప్రవేశపెట్టాను. పంచమి గర్భం విచ్ఛిన్నం  చేయడానికి జ్వాల గర్భంలో గరుడ అంశం పెరుగుతుంది. ఇప్పుడు అర్థమైందా నాగేశ్వరి నా శక్తి ఏంటో..

నాగేశ్వరి కరాళి శక్తులు ఇప్పుడే పోగొడతాను అని పాముగా మారుతుంది. బుసలు కొడుతూ కరాళి మీదకు వెళ్తుంది. దీంతో కరాళి తన మంత్ర శక్తితో నాగేశ్వరి శక్తిని అడ్డుకుంటుంది. దీంతో మళ్లీ నాగేశ్వరి మనిషిగా మారిపోతుంది. ఇక తన మీదకే విషాన్ని ప్రయోగిస్తావా అని కరాళి నాగేశ్వరి మీదకు మంత్ర శక్తి ప్రయోగిస్తుంది. దీంతో నాగేశ్వరి మళ్లీ పాములా మారి పారిపోతుంది. 

ఇక చిత్ర తన పాపకే ఆస్తి దక్కుతుంది అనుకుంటే పంచమి, జ్వాలలు గర్భవతులు అయ్యారని వాళ్ల బిడ్డలు తన బిడ్డకు అడ్డు రాకూడదని కోరుకుంటుంది. ఇక భార్గవ్ పెళ్లాం పూజ చేయడంతో షాక్ అయి ఇంట్లో అందర్ని పిలుస్తాడు. అందరూ హారతి తీసుకుంటూ వింతలు జరుగుతున్నాయని అంటారు. 

పంచమి, జ్వాలలకు పండంటి బిడ్డలు పుట్టాలని పూజలు చేశానని అంటుంది. ఇక అందరి కోసం పాయసం చేశానని తీసుకురావడానికి  చిత్ర వెళ్తుంది. వైదేహి ఇంట్లో అన్నీ శుభ సూచికాలే జరుగుతున్నాయని అంటుంది. దీంతో శబరి అంతా మన మనసులోనే ఉంటుందని అంటుంది. చిత్ర పాయసం తీసుకొని వస్తే  జ్వాల అందరికీ నేనే ఇస్తాను అని తీసుకొని అందరికీ ఇస్తుంది. ఇక పంచమికి కూడా ఇస్తుంది. పంచమి జ్వాలను చూసి భయపడుతుంది. మోక్ష వెనక దాక్కుంటుంది. అందరూ ఆశ్చర్యపోతారు. 

జ్వాల: ఏమైంది పంచమి తీసుకో..

పంచమి: నాకు వద్దు.

చిత్ర: దేవుడి ప్రసాదం అలా అనకూడదు పంచమి తీసుకో ముఖ్యంగా మీకు పుట్టబోయే పిల్లులు బాగుండాలి అనే చేశాను. 

రఘురాం: అమ్మా పంచమి జ్వాల చాలా మారిపోయింది అమ్మా. మీ ముగ్గురు అక్కా చెల్లెల్లా కలిసి మెలసి ఉండాలి. 

జ్వాల: పంచమి నిన్నే తీసుకో. 

మోక్ష: పంచమి పాయసం తీసుకో. 

పంచమి: తీసుకోవడానికి వస్తూ జ్వాల గరుడలా కళ్లు రంగు మారడంతో పంచమి తనకు వద్దు అని తన కడుపులో ఏదో అవుతుందని అక్కడి నుంచి పారిపోతుంది.

జ్వాల: పంచమికి నా మీద ఇంకా అనుమానం పోయినట్లు లేదు. అందులో నా చేతిలో పాయసం తీసుకొని తాగడానికి భయపడింది.

మోక్ష: అదేం లేదు వదినా కడుపులో బిడ్డకు ఏమైనా అవుతుందని ఈ మధ్య భయపడుతుంది. 

కరాళి చెప్పింది నిజమా అబద్ధమా నిర్ధారించుకోవాలి అని నాగేశ్వరి జ్వాల గదికి వస్తుంది. జ్వాల పడుకొని ఉంటే వచ్చి జ్వాల గర్భాన్ని తాకుతుంది. అప్పుడు గరుడ అరుపుల శబ్ధం విని షాక్ అయిపోతుంది. ఇంతలో జ్వాల లేవగానే పాములా మారి నాగేశ్వరి వెళ్లిపోతుంది. జ్వాల హడావుడిగా కడుపు మీద చేయి వేసుకొని కంగారు పడి ఎవరైనా ఉన్నారా అని గది అంతా వెతుకుతుంది. ఇంతలో వరుణ్ లేచి ఈ టైంలో ఏం వెతుకున్నావని అడిగితే సీరియస్‌గా చూస్తుంది. వరుణ్ భయపడతాడు. దీంతో మళ్లీ జ్వాల దుప్పటి కప్పుకొని పడుకుంటుంది. 

కరాళి చెప్పింది నిజమేనని జ్వాల గర్భం నుంచి గరుడ అరుపులు వినిపిస్తున్నాయని అది పంచమికి మంచిది కాదని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'కృష్ణమ్మ' మూవీ రివ్యూ, నారా రోహిత్‌ 'ప్రతినిధి 2' రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!

2024-05-10T15:07:42Z dg43tfdfdgfd