NAWAZUDDIN SIDDIQUI: నేను చాలా వికారంగా ఉంటాను, అదంతా నాకు అలవాటైపోయింది - నవాజుద్దీన్ సిద్ధికి

Nawazuddin Siddiqui: బాలీవుడ్‌లో ఏ బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ లేకుండా వచ్చి స్టార్లుగా ఎదిగినవారు చాలామందే ఉన్నారు. అలాంటివారిలో నవాజుద్దీన్ సిద్ధికి ఒకరు. ఎన్నో ఏళ్లుగా తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకొని ప్రేక్షకులను అలరిస్తున్నాడు ఈ యాక్టర్. ‘ది లంచ్‌బాక్స్’, ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్’, ‘కహానీ’, ‘సేక్రెడ్ గేమ్స్’ లాంటి సినిమాలు, సిరీస్‌లు నటుడిగా నవాజుద్దీన్ సిద్ధికికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. కానీ కెరీర్ మొదట్లో లుక్స్ పరంగా ఎంతో నెగిటివిటీని ఎదుర్కున్నారు నవాజుద్దీన్. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని ఇండస్ట్రీలో లుక్స్ పరంగా తానే వికారమైన యాక్టర్ అనుకుంటానని తెలిపారు.

వికారంగా ఉంటాను..

తన లుక్స్ గురించి నేరుగానే నెగిటివ్ కామెంట్స్ చేసిన వారి గురించి నవాజుద్దీన్ సిద్ధికి స్పందించారు. ‘‘మా లుక్స్ కొందరికి ఎందుకు నచ్చవో నాకు తెలియదు. ఎందుకంటే మేము వికారంగా ఉన్నామని వారికి అనిపిస్తుందేమో. నాకు కూడా అద్దంలో చూసుకున్నప్పుడు అదే నిజమేమో అనిపిస్తుంటుంది. అసలు ఇలాంటి లుక్స్‌తో ఇండస్ట్రీలోకి ఎలా వచ్చానా అని నన్ను నేనే ప్రశ్నించుకుంటాను. లుక్స్ పరంగా ఇండస్ట్రీలో నేను చాలా వికారమైన యాక్టర్. ఈ విషయం నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే ముందు నుండే ఇదంతా నేను వింటూ ఉన్నాను. ఇప్పుడు ఇదే నేను నమ్ముతున్నాను కూడా’’ అని తెలిపారు నవాజుద్దీన్.

నేరుగా ఓటీటీ సినిమాలు..

తన కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో రకాల పాత్రలు పోషించడం సంతోషంగా ఉందని అన్నారు నవాజుద్దీన్ సిద్ధికి. ఆయన చివరిగా ‘హడ్డీ’ అనే మూవీలో నటించారు. అది జీ5లో విడుదలయ్యింది. ఇందులో నవాజుద్దీన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక తను లీడ్ రోల్ చేసిన మరో సినిమా ‘రౌతూ కా రాజ్’.. జూన్ 28న జీ5లో విడుదలయ్యింది. దీనిని ఆనంద్ సురాపూర్ డైరెక్ట్ చేశారు. ఇందులో నవాజుద్దీన్‌తో పాటు అతుల్ తివారీ, రాజేష్ కుమార్, నారాయణి శాస్త్రి కూడా కీలక పాత్రల్లో కనిపించారు. ఎప్పుడూ తన అప్‌కమింగ్ చిత్రాలను పెద్దగా హడావిడి లేకుండా విడుదల చేస్తుంటారు నవాజుద్దీన్ సిద్ధికి. అందుకే ఇప్పుడు కూడా తన తరువాతి సినిమాలపై పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు.

వెబ్ సిరీస్‌లు కూడా..

సినిమాలు మాత్రమే కాదు.. వెబ్ సిరీస్‌లలో కూడా నవాజుద్దీన్ సిద్ధికి స్టోరీ సెలక్షన్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా విడుదలయిన ‘సేక్రెడ్ గేమ్స్’ అనే వెబ్ సిరీస్‌లో నవాజుద్దీన్ క్యారెక్టర్ చాలా బాగుందని ఆడియన్స్ ప్రశసించారు. ప్రస్తుతం తన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో మూడు చిత్రాల షూటింగ్ జరుగుతుండగా.. మరో మూవీ మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి చేరుకుంది. కానీ వీటి విడుదలపై ఎలాంటి క్లారిటీ లేదు. ‘సేక్రెడ్ గేమ్స్’ తర్వాత నవాజుద్దీన్ మరికొన్ని వెబ్ సిరీస్‌లలో నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు కానీ తన అప్‌కమింగ్ వెబ్ సిరీస్ ప్రాజెక్ట్స్‌పై ఎలాంటి క్లారిటీ లేదు.

Also Read: EMI కట్టలేదని షారుఖ్ కారును తీసుకెళ్లిపోయారట, పాపం ఏమీ మిగల్లేదు: జుహీ చావ్లా

2024-07-02T14:41:43Z dg43tfdfdgfd