NBK 109 మూవీ యూకే రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ బడా బ్యానర్

NBK 109 మూవీ యూకే రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ బడా బ్యానర్

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నెక్స్ట్ ఫిల్మ్ (NBK109) ని బాబీ డైరెక్షన్లో చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కూడా చాలా విభిన్నమైన యాక్షన్..ఎమోషన్తో పాటు సోషల్ మెసేజ్ను టచ్ చేస్తూ వస్తుంది. ఈ మూవీని నిర్మాత నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చూన్ త్రివిక్రమ్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది.NBK మేకర్స్ ఈ సినిమా UK రైట్స్ ని డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది.ఈ చిత్రం నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన హంటింగ్  గ్లింప్స్ పై  భారీ అంచనాలున్నాయి. ఈ  గ్లింప్స్ లో బాలయ్య మాస్ డైలాగ్స్ అదిరిపోయాయి.

ప్రస్తుతం బాలయ్య ఎన్నికల బిజీలో ఉన్నాడు.ఇక ఆ ఎన్నికలు కంప్లీట్ అవ్వగానే NBK109 షూటింగ్ లో పాల్గొంటారు. కల్ట్ సరుకుతో లయన్ వేటకు వస్తోంది అంటూ సరికొత్త పోస్టర్ తో అంచనాలు పెంచారు.'సింహం నక్కల మీదకు వస్తే..వార్ అవ్వదురా లఫూట్..ఇట్స్ హంటింగ్ అంటూ బాలయ్య సిగ్నేచర్ డైలాగ్ తో ఒక్కసారిగా ఫ్యాన్స్ కు ఫుల్ ఎక్కించేశాడు.మరి సినిమాతో ఎలాంటి కిక్ ఎక్కిస్తాడో చూడాలి. 

ఈ మూవీలో ‘యానిమల్‌‌‌‌’తో మెప్పించిన బాబీడియోల్ విలన్‌‌‌‌గా నటిస్తున్నాడు.ఇందులో మరో ముఖ్యమైన పాత్ర కోసం ఒక యంగ్ హీరో కూడా నటిస్తున్నాడు.మన తెలుగు వాళ్లకి సీతారాముడిగా..ఎంతో సుపరిచుతులైన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (DulquarSalman)నటిస్తున్నట్లు సమాచారం.

©️ VIL Media Pvt Ltd.

2024-05-07T08:34:06Z dg43tfdfdgfd