NEERAJ CHOPRA | పారిస్‌ ఒలింపిక్స్‌కు నీరజ్‌ చోప్రా దూరం..! కారణాలు ఏంటంటే..?

Neeraj Chopra | ప్రపంచ ఛాంపియన్, భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌కు ముందు కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల పావో నుర్మి గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్‌.. త్వరలో జరుగబోయే పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనడం లేదు. సమాచారం మేరకు.. తొడ లోపలి కండరాల్లో సమస్య కారణంగా నీరజ్‌ లీగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించున్నాడు. టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. గత నెలలో జరిగిన పావో నుర్మి గేమ్స్‌లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. ఒలింపిక్స్‌కు ముందు జరిగిన ఈ గేమ్స్‌లో నీరజ్ 85.97 మీటర్ల బెస్ట్ త్రోతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీలో నీరజ్ వెనుకబడినప్పటికీ మూడో ప్రయత్నంలో అద్భుతంగా పునరాగమనం చేసి చివరి వరకు ఆధిక్యాన్ని కొనసాగించడంలో సఫలమయ్యాడు.

ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.. త్రో వేసే సమయంలో కాలు గజ్జలు ఒత్తిడికి గురవుతాయని చెప్పాడు. భవిష్యత్‌లో టోర్నమెంట్‌లో ఆడాలనుకుంటున్నానని.. ప్రస్తుతం ఆరోగ్యమే ప్రధానమని భావించానన్నారు. అసౌకర్యంగా ఉంటేనే ఆపడం మంచిదని.. రిస్క్ తీసుకోనని చెప్పాడు. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించే ముందు ప్రతి పోటీలో పాల్గొనాలని అనుకున్నానని.. ఇప్పుడు అనుభవంతో సరైన నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టానన్నాడు. ఫిన్‌లాండ్‌లో ప్రదర్శన బాగానే ఉందని.. అయితే మరింత సాధన చేయాల్సి ఉందన్నాడు. ఇదిలా ఉండగా.. ఈ నెల 26 నుంచి జరుగనున్న పారిస్‌లో ఒలింపిక్స్‌ జరుగనున్నాయి. భారత జట్టు ఆదివారం బయలుదేరనున్నది. ఈ క్రమంలో ప్యారిస్ వెళ్లే క్రీడాకారులకు వీడ్కోలు వేడుకను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మన్సుఖ్‌ మాండవీయ పాల్గొన్నారు. ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తోందన్నారు. ప్యారిస్‌కు వెళ్లే క్రీడాకారులకు లాంఛనంగా వీడ్కోలు పలికి కిట్‌ను ఆవిష్కరించారు.

2024-07-01T15:12:00Z dg43tfdfdgfd