NEWS LIVE UPDATES: ఏపీ, తెలంగాణ, లోక్‌సభ వార్తలు.. లైవ్ అప్ డేట్స్

News Live updates: తెలుగు రాష్ట్రాల్లో నిన్న వానలు దంచేశాయి. ఇవాళ కూడా అదే పరిస్థితి ఉంటుందని తెలిసింది. మరో 5 రోజులు వానలు పడతాయని అధికారులు అంచనా వేశారు. నిన్న వానల వల్ల ఏడుగురు చనిపోగా.. ఏపీలో పిడుగులు పడి ఇద్దరు చనిపోయారు. నిన్న ఏపీలో కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా పడింది. నిన్న మూడో దశలో 61 శాతం పోలింగే నమోదైంది. ఇప్పటివరకూ జరిగిన మూడు దశల్లో కూడా పోలింగ్ తక్కువగానే నమోదవుతోంది. మరి 13న జరిగే నాలుగో దశ ఎలా ఉంటుందో. నిన్న తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీ.. రాత్రి రాజ్‌భవన్‌కి వచ్చారు. అక్కడ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇవాళ ఉదయం ఆయన.. వేములవాడ, వరంగల్‌లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు. అలాగే.. విజయవాడలో రోడ్ షో ఉంది. ఇందులో చంద్రబాబు కూడా పాల్గొంటారు. ఇవాళ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్‌లో ప్రచారం చేస్తారు. అటు సీఎం జగన్ మరోసారి విశాఖ ప్రస్తావన తెచ్చారు. జూన్ 4న తాను విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని అన్నారు.

ఐపీఎల్‌లో ఇవాళ 1 మ్యాచ్ ఉంది. అది హైదరాబాద్ (SRH), లక్నో (LSG) మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇది హైదరాబాద్‌లో రాత్రి 7.30కి ఉంటుంది. ఐతే.. ఆ సమయంలోనే హైదరాబాద్‌లో భారీ వర్షం పడే సంకేతాలు కూడా ఉన్నాయి. ఇలాంటి అంశాలపై లైవ్ అప్‌డేట్స్ తెలుసుకుందాం.

2024-05-08T01:06:00Z dg43tfdfdgfd