NIKHIL: సూపర్ హిట్ కాంబోలో నిఖిల్ సినిమా.. కానీ కనుమరుగైపోయింది

Nikhil Movie Shelved: యువ హీరో నిఖిల్ చేతిలో ఇప్పుడు రెండు పెద్ద సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే నిఖిల్ సుధీర్ వర్మ కాంబోలో రావాల్సిన మరొక భారీ సినిమా మాత్రం.. హోల్డ్ లోనే ఉండిపోయింది. ఈ సినిమా అసలు విడుదల అవుతుందా లేదా అని అభిమానులలో డౌట్స్ మొదలయ్యాయి.   

Nikhil Upcoming Movies : రొటీన్ కధలకి భిన్నంగా కేవలం కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకోవడం.. హీరో నిఖిల్ స్పెషాలిటీ. నిఖిల్ సినిమా అంటే కచ్చితంగా అందులో ఏదో ఒక కొత్త పాయింట్ ఉంటుంది అని అభిమానులు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా.. నిఖిల్ కూడా తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.

ఈ మధ్యనే కార్తికేయ 2 సినిమాతో తన కెరియర్ లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు నిఖిల్. టాలీవుడ్ లో మాత్రమే కాక బాలీవుడ్ లో కూడా ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. అయితే ఆ తర్వాత వచ్చిన 18 పేజెస్, స్పై సినిమాలు మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. దీంతో తన ఆశలన్నీ తదుపరి ప్రాజెక్టులు పైన పెట్టుకున్నారు ఈ హీరో. నిఖిల్ చేతిలో ఇప్పుడు రెండు ప్యాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. 

అందులో ఒకటి స్వయంభూ. ఈ సినిమా కోసం నిఖిల్ చాలానే కష్టాలు పడుతున్నట్లుతెలుస్తోంది. కేవలం ఈ యొక్క సినిమా కోసం కత్తి సాముతో పాటు యుద్ధ విద్యలు కూడా నేర్చుకుంటున్నాడు ఈ యువ హీరో. తెరమీద ఇప్పటిదాకా చూడనటువంటి ఒక అరుదైన ఆవిష్కరణ ఈ సినిమాలో ఉంటుంది అని టాక్ వినిపిస్తోంది. స్వయంభు కాకుండా చారిత్రక సంఘటన ఆధారంగా రూపొందుతున్న ది ఇండియా హౌస్ సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళనుంది. స్పయానా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 

ఈ రెండు సినిమాల సంగతి పక్కన పెడితే మూడేళ్ల క్రితం సుదీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా బీ వీ ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఒక సినిమా మొదలైంది. సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్, దివ్యాన్ష ఈ సినిమాలో హీరోయిన్లుగా ఎంపిక అవ్వగా, గాయకుడు కార్తీక్ సంగీత దర్శకుడిగా చేయాలి. ఇప్పటికే విదేశాల్లో ఈ సినిమాకి సంబంధించిన కీలక భాగం షూటింగ్ పూర్తి అయిపోయింది. కానీ హఠాత్తుగా సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఆగిపోయాయి. ఇప్పటిదాకా తీసినంత వరకు సినిమా అవుట్ పుట్ పెద్దగా నచ్చకపోవడంతో.. నిఖిల్ సినిమా నుంచి బ్రేక్ తీసుకున్నాడని, స్పై సినిమా విషయంలో జరిగిన పొరపాట్లు.. ఈ సినిమాలో మళ్లీ రిపీట్ అవ్వకూడదని నిఖిల్ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.

మరి భవిష్యత్తులో అయినా ఈ సినిమాకి వెండి తెర మీద కనిపించే భాగ్యం ఉందో లేదో చూడాలి. నిర్మాత కూడా ఈ సినిమా గురించి ఏమీ మాట్లాడడం లేదు. అప్పటికే సుధీర్ వర్మ నిఖిల్ కాంబోలో స్వామి రారా సినిమా బ్లాక్ బస్టర్ కాగా కేశవ సినిమా యావరేజ్ గా నిలిచింది. వీరి కాంబో లో మూడవ సినిమాగా ఈ చిత్రం హిట్ అవుతుందేమోనని అభిమానులు అనుకున్నారు. కానీ ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు.

Also Read: Starliner: కీలక అంతరిక్ష ప్రయోగం నిలిపివేత.. సునీతా విలియమ్స్‌ రికార్డుకు బ్రేక్‌

Also Read: NEET 2024 Paper Leak: నీట్ 2024 పేపర్ లీక్ అయిందా, ఆ కేంద్రంలో విద్యార్ధులకు మళ్లీ పరీక్ష

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-05-07T11:17:24Z dg43tfdfdgfd