OTTలో ఈ 5 సినిమాలను మీ పిల్లలకు తప్పక చూపించండి!

ఈ మధ్య కాలంలో యంగ్ జనరేషన్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసే క్రేజ్ పెరిగింది. మంచి సినిమాల నుండి ప్రజలు చాలా నేర్చుకుంటారు. సినిమాలు చూసిన తర్వాత మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని అంటున్నారు. మీ జీవితంలో పెద్ద మార్పులు రావాలంటే ఈ సినిమాలను చూడండి.
ఈ చిత్రాలను మీరు చూసే ప్రతిసారీ మీ విశ్వాస స్థాయి పెరుగుతుంది. ఈ సినిమాలు చూసి మీ జీవితం మారిపోతుందని చెప్పొచ్చు. మరి ఆ 5 సినిమాల గురించి తెలుసుకుందాం.
హిచ్కీ (2018) : ఇది కామెడీ డ్రామా చిత్రం, సిద్ధార్థ్ పి. మల్హోత్రా రచన, దర్శకత్వం వహించారు. యష్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్య చోప్రా, మనీష్ శర్మ నిర్మించారు. ఈ చిత్రంలో రాణి ముఖర్జీ 'నైనా మాథుర్'గా ప్రధాన పాత్రలో కనిపించింది. ఇది మోటివేషనల్ మూవీ. ఇది మీకు జీవించడానికి కొత్త దృక్పథాన్ని ఇస్తుంది. మీరు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. 
దంగల్ (2016) : అమీర్ ఖాన్ సినిమా 2016లో అత్యధిక వసూళ్లు రాబట్టింది. దాదాపు 2000 కోట్లుగా వచ్చాయిని టాక్. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత మీరు మీ జీవితంలో ఏదైనా చేయాలనుకుంటున్నారనే నమ్మకం మీకు కలిగిస్తుంది. ఇది స్పోర్ట్స్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో మహావీర్ సింగ్ ఫోగట్ పాత్రలో అమీర్ ఖాన్ నటిస్తున్నాడు. మీరు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.
ఇంగ్లీష్ వింగ్లీష్ (2012) : గౌరీ షిండే రచన, దర్శకత్వం వహించిన డ్రామా చిత్రం. ఈ సినిమాలో శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించింది. శశి (శ్రీదేవి) ఇంగ్లీషులో మాట్లాడినప్పుడల్లా ఆమె భర్త, కూతురు ఆమెను ఎగతాళి చేస్తారు. ఈ సినిమాను చూస్తే.. భావోద్వేగానికి లోనవ్వడం ఖాయం. జుదాయి (1997) తర్వాత 15 ఏళ్లకు శ్రీదేవి ఈ సినిమాతో తెరపై అద్భుతంగా రీ ఎంట్రీ ఇచ్చింది. మీరు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో సినిమాలో ఉచితంగా చూడవచ్చు.
దాస్వి (2022): తుషార్ జలోటా దర్శకత్వం వహించిన సోషల్ కామెడీ. ఇందులో అభిషేక్ బచ్చన్, యామీ గౌతమ్, నిమ్రత్ కౌర్ నటిస్తున్నారు. ఇదొక గొప్ప సినిమా అని చెప్పోచ్చు. చూసిన తర్వాత జీవితంలో ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఈ చిత్రం మీ విశ్వాసాన్ని చాలా పెంచుతుంది. మీరు ఈ సినిమాని నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.
ఐ యామ్ కలాం (2011 : నీలా మాధబ్ పాండా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో, హర్ష మేయర్ ఛోటుగా చిత్రానికి జీవం పోశారు. ఈ చిత్రం 63వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది. మీరు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

2024-03-27T13:12:11Z dg43tfdfdgfd