PARSHURAM JAYANTI 2024 DATE: మాహిష్మతి రాజ్యాన్ని జయించిన మహావీరుడి జయంతి అక్షయ తృతీయ రోజే!

Parshuram Jayanti 2024 Date: రాజమౌళి బాహుబలిలో మాహిష్మతి సామ్రాజ్యం గురించి సినీ ప్రియులంతా చూశారు. ఆ సామ్రాజ్యాన్ని వర్ణిస్తూ ఓ ప్రత్యేక పాట కూడా ఉంది. సినిమాలో జక్కన్న సృష్టించిన మాహిష్మతి సామ్రాజ్యం..పురాణాల్లో ఉంది. అత్యంత పెద్ద సామ్రాజ్యం..అలాంటి రాజ్యాన్ని జయించిన మహావీరుడు పరశురాముడు. 

శ్రీ మహావిష్ణువు ఆవేశ అవతారం

అరాచకత్వం నుంచి ధరణిని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటిగా పరశురాముడు భూమ్మీద జన్మించాడు. పార్షు (గొడ్డలి )తో దుష్టశిక్షణ చేస్తాడు కాబట్టే పరశురాముడు అయ్యాడు. రేణుక-జమదగ్ని సంతానంలో ఐదో వాడు. హిందూ పురాణాల ప్రకారం పరశురాముడు ఇప్పటికీ జన్మించి ఉన్నాడని చెబుతారు. 

Also Read: అక్షయ పాత్ర మొదట ఎవరు ఎవరికి ఇచ్చారు - ఇప్పుడా పాత్ర ఎక్కడుంది!

మహామహులకు గురువర్యులు

కురువృద్ధుడైన భీష్మ పితామహుడు, పాండవులు కౌరవులకు విలువిద్య నేర్పించిన ద్రోణాచార్యుడు, కుంతికి జన్మించి రథసారధి సూతుడి దగ్గర పెరిగిన కర్ణుడు...ఈ ముగ్గురికి పరశురాముడే గురువు.  

క్షత్రియులపై అంతులేని ఆగ్రహం

క్షత్రియ జాతిని అంతం చేయడమే పరశురాముడి అంతిమ లక్ష్యం. దీనికి కారణం ఏంటో చెబుతూ హరి వంశ పురాణంలో ఓ కథనం ప్రచారంలో ఉంది. హైహయ వంశానికి చెందిన కార్తవీర్యార్జునుడు శాపఫలితంగా చేతుల్లేకుండా పుట్టాడు. ఆ తర్వాత దత్తాత్రేయుడిని ఆరాధించి వేయి చేతులు పొంది మహావీరుడు అయ్యాడు. ఓసారి వేటకు వెళ్లి అలసిపోయి కనిపించి కార్తవీర్యార్జునుడిని తన ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టాడు జమదగ్ని మహర్షి. అదంతా చూసి మహారాజు ఆశ్చర్యపోయాడు. ఇంత అడవిలో ఉంటూ..ఒక్కసారిగా ఇంతమందికి ఇన్ని రకాల పిండివంటలు ఎలా వండి వడ్డించారని ప్రశ్నించాడు. మహర్షి వెంటనే తనవద్దనున్న కామధేనువుని చూపించాడు. అది తనకు కావాలన అడిగిన కార్తావీర్యార్జునిడితో అది జరగదు అని చెబుతాడు. మహారాజు తలుచుకుంటే ఆపేదెవరు అన్నట్టు కామధేనువుని బలవంతంగా తీసుకెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన పరశురాముడు జరిగిన విషయం తెలుసుకుని...కార్తావీర్యార్జునుడు పాలించే మాహిష్మతి రాజ్యానికి వెళ్లి యుద్ధం చేసి చంపేసి ఆ కామధేనువుని తిరిగి తీసుకొస్తాడు. దానికి ప్రాయశ్చిత్తంగా పుణ్యక్షేత్ర సందర్శన చేయమని చెబుతాడు తండ్రి.  తన తండ్రిని చంపిన పరశురాముడిపై రగిలిపోతారు కార్తావీర్యార్జునిడి కుమారులు. తను ఇంట్లో లేని సమయంలో వెళ్లి జమదగ్ని మహర్షి తల నరికేస్తారు. అందుకు ప్రతీకారంగా వాళ్లని చంపేసి...తనకున్న విద్యతో తండ్రి తలను మొండేనికి అతికించి బతికిస్తాడు. అప్పటి నుంచీ క్షత్రియుల నాశనమే అంతిమలక్ష్యంగా భావించి వరుస దండయాత్రలు చేసి...వాళ్లని చంపిన రక్తంతో 5 సరస్సులు నింపాడు. 

Also Read: అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేయాల్సిన వస్తువులు ఇవే!

త్రేతాయుగం - ద్వాపరయుగంలో పరశురాముడు

@ శివధనస్సుని విరిచిన రాముడి గురించి విన్న పరశురాముడు తన దగ్గరున్న విల్లుని విరవమంటూ సవాల్ చేస్తాడు. దానిని ఎక్కుపెట్టిన రాముడిని చూసి సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే అని తెలుసుకుని.. ఆ క్షణం రాముడు బాణం వేసిన మహేంద్రగిరిపై ధ్యానం చేసుకునేందుకు వెళ్లిపోయాడు 

@ భీష్ణుడు, ద్రోణుడు, కర్ణుడికి విద్యనేర్పించింది...బ్రాహ్మణుడిని అని అబద్ధం చెప్పి విద్య నేర్చుకున్న కర్ణుడికి శాపం ఇచ్చింది పరశురాముడే. 

@ కలియుగంలో రానున్న కల్కికి కూడా విద్యలు నేర్పించేది పరశురాముడే అని పురాణాల్లో ఉంది.  

Also Rad: అక్షయతృతీయ రోజు బంగారం కొనాల్సిందే అనే మాయలో పడుతున్నారా!

పరశురామ గాయత్రి మంత్రం

ఓం జామదగ్న్యాయ విద్మహే మహావీరాయ ధీమహి

 తన్నో పరశురామః ప్రచోదయాత్ ॥

శ్రీ మహవిష్ణువు అవతారాల్లో ఒకటైన పరశురాముడిని పూజించడం వల్ల చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది, దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్య సమస్యలు దూరమైపోతాయని భక్తుల విశ్వాసం.

Also Read: అక్షయ తృతీయ ఎప్పుడు - ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి , ఈ రోజు ఏం చేయాలి!

2024-05-09T12:48:45Z dg43tfdfdgfd