PAWAN KALYAN: పవన్ కళ్యాణ్ విద్యార్హతపై స్పష్టత, చదివింది పదో తరగతేనట

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విద్యార్హతపై చాలాకాలంగా సందిగ్దత నెలకొంది. ఇంటర్ చదివారా లేదా, చదివుంటే ఏ గ్రూప్ తీసుకున్నారు ఇలాంటి చాలా ప్రశ్నలు చాలాకాలంగా జనసైనికుల్లో వెంటాడుతున్నాయి. కారణం తన విద్యార్ఙతపై ఎప్పుడూ స్పష్టంగా చెప్పకపోవడమే. ఇప్పుడా పరిస్థితి తెరపడింది. పవన్ కళ్యాణ్ ఏం చదివారో తేలిపోయింది. 

భారత ప్రజాస్వామ్యంలో పోటీ చేసేందుకు చదువు అర్హత కానేకాదు. ఏం చదవకపోయినా ఫరవాలేదు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ప్రజల్లో, ముఖ్యంగా జనసైనికుల్లో చాలాకాలంగా కన్ఫ్యూజన్ నెలకొంది. ఎందుకంటే పదో తరగతిలో వచ్చిన మార్కులకు సీటు రాకపోవడంతో నెల్లూరులోని రికమండేషన్‌తో ఇంటర్ సీఈసీ తీసుకున్నానని ఓసారి, ఎంఈసీ చదివానని మరోసారి, ఫ్రెండ్స్‌తో కలిసి ఎంపీసీ ట్యూషన్‌కు వెళ్లేవాడినని ఇంకోసారి ఇలా పూటకో మాట చెప్పడంతో జనసైనికుల్లో సందిగ్దత నెలకొంది. ఇంకొన్ని సందర్భాల్లో ఎలక్ట్రానిక్ డిప్లొమా చేశానని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. డాక్టర్ అవ్వాలని గట్టి ప్రయత్నం చేశానని కూడా చెప్పుకొచ్చారు. తన విద్యార్ఙతపై ఇన్ని మాటలు మాట్లాడినందునే పవన్ కళ్యాణ్ విద్యార్హత అంశం బాగా ట్రోల్ అయింది. చివరికి పవన్ కళ్యాణ్ నామినేషన్ సందర్భంగా ఈ అంశానికి దాదాపుగా తెరపడినట్టయింది.

జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా విద్యార్ధత వివరాలను ఇచ్చారు. దీంతో ఇప్పటివరకూ ఆయన విద్యార్హతపై రేగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టయింది. ఎన్నికల అఫిడవిట్‌లో తాను పదో తరగతి పాస్ అయినట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు. నెల్లూరులోని సెయింట్ జోసెప్ ఇంగ్లీషు మీడియం హైస్కూల్‌లో 1984లో పదో తరగతి పూర్తి చేసినట్టుగా పేర్కొన్నారు. 

Also read: Heat Waves Alert: రానున్న 5 రోజుల్లో మరింత భగభగమండనున్న రాష్ట్రాలు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2024-04-23T17:23:58Z dg43tfdfdgfd