PRABHAS JOINS KANNAPPA SHOOTING: ఎట్టకేలకు కన్నప్ప సెట్ లో అడుగుపెట్టిన ప్రభాస్..

Prabhas Joins Kannappa Shooting: మంచు విష్ణు త‌న‌ డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్ ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే అక్ష‌య్ స‌హా ప‌లువురు అగ్ర న‌టులు కన్నప్ప సెట్‌లో అడుగు పెట్టి షూటింగ్‌లను పూర్తి చేశారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్   ప్రభాస్ ఎట్ట‌కేల‌కు క‌న్న‌ప్ప షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టారు. ఈ విష‌యాన్ని మంచు విష్ణు త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. త‌న సోద‌రుడు ప్ర‌భాస్ షూటింగ్  సెట్‌లోకి అడుగుపెట్టారు. అంటూ త‌న సంతోషాన్ని పంచుకున్నారు.

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన కన్నప్ప చిత్రాన్ని మోహన్ బాబు క‌నీవినీ ఎర‌గ‌నీ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివుని భక్తుడైన భక్త కన్నప్ప అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని చూపించబోతున్నారు.

"కన్నప్ప"లో ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీతో సహా ఆకట్టుకునే అద్భుతమైన టీం పని చేస్తోంది. ఆకర్షణీయమైన విజువల్స్, అద్భుతమైన కథ, కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్ర‌భాస్ మ‌హా శివుడిగా న‌టిస్తున్న‌ట్టు ఆ మ‌ధ్య వ‌చ్చింది. కానీ ఈ చిత్రంలో అక్ష‌య్ కుమార్ శివుడి వేషం వేసిన‌ట్టు వార్త‌లు పుకార్లు చేస్తున్నాయి. మ‌రి ఇందులో ప్ర‌భాస్ ఏ పాత్ర పోషించ‌బోతున్నాడ‌నేది చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఏది ఏమైనా ప్ర‌భాస్ రాక‌తో క‌న్న‌ప్ప క్రేజ్ పీక్స్ చేరింద‌నే చెప్పాలి. ఈ సినిమా ఈ యేడాదే విడుద‌ల చేయాల‌నే ప్లాన్‌లో ఉన్నారు. గతంలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు హీరోగా  'భక్త కన్నప్ప' సినిమా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే క‌దా. ఆయన కూడా ప్రభాస్‌తో కన్నప్ప సినిమాను రీమేక్ చేయాలనున్నారు. తీరా ఆ ప్రాజెక్ట్ మంచు విష్ణు చేతిలోకి వెళ్లింది. ఆయన ఈ సినిమాలో మహా దేవుడి పాత్రకు ఇంపార్టెంట్ ఉండటం.. ఆ క్యారెక్టర్‌ కోసం ప్రభాస్‌ను సంప్రదించడం జరిగింది. ఇక మంచు విష్ణుతో స్నేహంతో పాటు అటు పెదనాన్న కోరికను మన్నించినట్టు అవుతుందని ఎంతో బిజీగా ఉన్నా ఈ ప్రాజెక్ట్‌లో యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

గతంలో మంచు విష్ణు హీరోగా నటించిన 'దేనికైనా రెడీ'లో ప్రభాస్ వాయిస్ ఓవర్ చెప్పిన సంగతి తెలిసిందే కదా. కన్నప్పలో నటించేందుకు ప్రభాస్ ఎలాంటి పారితోషకం తీసుకోవడం లేదనేది సమాచారం. ఇప్పటికే మహా శివరాత్రి సందర్భంగా కన్నప్ప ఫస్ట్ లుక్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ప్రభాస్.. కల్కి, కన్నప్పలతో పాటు మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్', సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్‌' మూవీలతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ వార్ డ్రామాలో నటిస్తున్నాడు. అటు సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో భారీ యాక్షన్ చిత్రం చేయనున్నాడు. ఇక ప్ర‌భాస్ క‌ల్కి 2898 AD మూవీని జూన్ 27న విడుద‌ల చేస్తున్నారు.

Read More: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-05-09T13:09:41Z dg43tfdfdgfd