PRABHAS REMUNERATION: 'కల్కి'కి ప్రభాస్‌ రెమ్యునరేషన్‌ తెలిస్తే అవాక్కావ్వాల్సిందే! - బడ్జెట్ లో 25 శాతం, ఎన్ని కోట్లంటే!

Prabhas Remuneration For Kalki Movie: ప్రస్తుతం ఇండియన్‌ మూవీ లవర్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ప్రభాస్ 'కల్కి 2898 AD'. సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామా తెరకెక్కుతున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. 'మహానటి' లాంటి భారీ హిట్‌ తర్వాత నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగ్‌ అశ్విన్‌ విజన్‌, మేకింగ్‌పై మూవీ లవర్స్‌లో రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. అందుకు తగ్గేట్టే భారీ తారాగణం కల్కిలో భాగమైంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి వస్తున్న అప్‌డేట్స్‌ బజ్‌ పెంచుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు ప్రభాస్‌ తీసుకుంటున్న రెమ్యునరేషన్‌కి సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది.

బాహుబలి తర్వాత ప్రభాస్‌ పాన్‌ ఇండియా, గ్లోబల్‌ స్టార్‌గా మారాడు. అంతేకాదు వరల్డ్‌ వైడ్‌ ప్రభాస్‌ మార్కెట్‌ కూడా అమాంతం పెరిగింది. దీంతో నార్త్‌ నుంచి సౌత్‌ వరకు హయ్యొస్ట్‌ పెయిడ్‌ యాక్టర్స్‌లో ప్రభాస్‌దే అగ్రస్థానం. తొలిసారి ప్రభాస్‌ కల్కితో పాన్‌ వరల్డ్‌ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ప్రభాస్‌ తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు హాట్‌టాపిక్‌ అవుతుంది. 'సలార్‌' వరకు ప్రభాస్‌ రూ. 120 కోట్ల నుంచి రూ. 150 కోట్ల వరకు తీసుకున్న డార్లింగ్‌ ఈ సినిమాకు భారీగా పారితోషికం పెంచాడట. కల్కికి రూ.200 కోట్ల వరకు తీసుకుంటున్నాడని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో గుసగుస. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. నిజానికి ప్రభాస్‌ రాధేశ్యామ్‌ మూవీ తర్వాత నుంచి సినిమాకి రెమ్యునరేషన్‌లా కాకుండా ఒక ఏరియా ప్రాఫిట్స్‌ తీసుకుంటున్నాడు.

పాన్‌ ఇండియా స్థాయిలో తన సినిమాలు రిలీజ్‌ అవుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని ఓ ఎరియా ప్రాఫిట్‌ తీసుకునేలా నిర్మాణ సంస్థలతో డీల్‌ కుదుర్చుకుంటున్నాడట. మరి కల్కికి అలాగే చేస్తాడా? పారితోషికం తీసుకుంటున్నాడా? అనేతి తెలియాల్సి ఉంది. అయితే కల్కి మూవీ మొదట మే 9న రిలీజ్‌ అని మూవీ టీం ప్రకటించింది. కానీ లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈ సినిమా వాయిదా పడుతున్నట్టు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పటికే ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను మూవీ ప్రకటించలేదు. దీంతో కల్కి మూవీ రిలీజ్‌ విషయంలో అంతా డైలామాలో ఉన్నారు. అయితే కల్కిని మే 30న రిలీజ్‌ చేసే అవకాశం ఉన్నట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. అయితే దీనిపై కల్కి టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

2024-04-25T14:08:59Z dg43tfdfdgfd