PRABHAS: తిప్పి తిప్పి ప్రభాస్‌తో మళ్లీ ఆ అట్టర్ ఫ్లాప్ సినిమా స్టోరీనే తీస్తున్నారా..?

ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నంత ఖుషీగా మరొకరు లేరు. గతేడాది సలార్, ఇప్పుడు కల్కీ... ఇలా బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లతో ఫ్యాన్స్ ఆకలి తీరిపోయింది. బోనస్‌గా ఈ రెండు సినిమాల్లో ప్రభాస్ లుక్స్ నెక్స్ట్ లెవల్ అసలు. సలార్ ముందు వరకు ప్రభాస్ లుక్స్‌ను కామెంట్స్ చేసిన వాళ్లే.. ఇప్పుడు పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ లైనప్‌లో మూడు సినిమాలున్నాయి. అందులో వచ్చే ఏడాది రిలీజ్‌కు ముస్తాబవుతున్న సినిమా రాజా డిలక్స్.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో మాములు అంచనాలు లేవు. పైగా ఆ మధ్య రిలీజైన ఫస్ట్ లుక్ కూడా నెక్స్ట్ లెవల్‌లో ఉంది. ఈ సారి ప్రభాస్ హ్యాట్రిక్ హిట్టు కొట్టేస్తాడని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ప్రముఖ సినిమా వెబ్‌సైడ్ IMDB సంస్థ.. తన సైట్‌లో రాజా సాబ్ స్టోరీ లైన్‌ను ఇలా రాసుకొచ్చింది. కొన్ని దుష్టశక్తుల వల్ల ఎదురయ్యే కష్టాలను ఓ ప్రేమజంట ఎలా ఎదుర్కొంది అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమ తెరకెక్కుతున్నట్లు రాసుకొచ్చింది.

ప్రస్తుతం ఈ స్టోరీ లైన్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మరోవైపు ఫ్యాన్స్ సైతం లవర్ బాయ్ రోల్‌లో ప్రభాస్ ఈ సారి బిగ్గెస్ట్ హిట్టు కొడతాడని ఊహల్లోకి వెళ్లిపోయారు. ఇలాంటి టైమ్‌లో మారుతి స్నేహితుడు, ఎస్‌కేన్ ఈ కథనాలపై స్పందించాడు. ఐఎండీబీ టీం చాలా తెలివైంది. రాధేశ్యామ్ కథను ఈ సినిమాకు కాపీ చేసింది. సిల్లీ ఫెలో అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. దాంతో అదీ ఫేక్ అని రుజువైంది. ఇది తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ప్రభాస్ ఓ వైపు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజాసాబ్ లాంటి మీడియం బడ్జెట్ సినిమా చూస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను దింపాలని మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. హారర్ కామెడీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ కుట్టి మాళవిక మోహనన్ తో పాటు మరో ఇద్దరు కథానాయికలు నటించబోతున్నారు. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషించనున్నాడు. తమన్ స్వరాలందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా బ్యానర్ పై టీజీ. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ప్రభాస్ ఈ సినిమాలో సరికొత్తగా కనిపించబోతున్నాడట.

2024-07-02T15:28:19Z dg43tfdfdgfd