PRABHAS : ప్రభాస్ పై కావాలనే నెగిటివ్ ప్రచారం.. కారణం అదేనా !

Trolls on Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు ప్రపంచమంతా వినిపిస్తోంది. బాలీవుడ్ ని పక్కకు నెట్టి.. టాలీవుడ్ పేరు ప్రపంచమంతా వినిపించేలా చేసిన ఘనత.. ప్రభాస్ బాహుబలి సినిమాకే దక్కింది. ఈ నేపథ్యంలోనే కావాలని కొందరు ప్రభాస్ పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారని అభిమానులు వాపోతున్నారు. 

Prabhas: రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన బాహుబలి పుణ్యమా అని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ప్యాన్ ఇండియా హీరో స్టేటస్ వచ్చింది. కేవలం భారతదేశంలో మాత్రమే కాక జపాన్, మలేషియా వంటి దేశాల్లో కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా కారణంగానే టాలీవుడ్ పేరు కూడా ప్రపంచమంతా మారుమ్రోగింది. 

బాహుబలి భారీ రేంజ్ హిట్ అవ్వడంతో అభిమానులు ప్రభాస్ నుంచి వచ్చే సినిమాలపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ తర్వాత విడుదలైన సాహో, రాధేశ్యామ్ సినిమాలు కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వలేదు. ఆదిపురుష్ కలెక్షన్లు బానే ఉన్నా టాక్ మాత్రం నెగిటివ్ గానే వచ్చింది. ఇక ఆ తర్వాత వచ్చిన సలార్ సినిమా మాత్రం ప్రభాస్ అభిమానులకు ఊరట ఇచ్చింది. దాదాపు 700 కోట్ల కలెక్షన్లు నమోదు చేసుకొని సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. 

ఈ క్రమంలో కొంతమంది కావాలని సోషల్ మీడియాలో ప్రభాస్ మీద నెగిటివ్ ప్రచారం చేయడం మొదలుపెట్టారు అని గత కొద్ది రోజుల నుంచి ఆయన అభిమానులు వాపోతున్నారు. సాహో సినిమా సమయం నుండే ఈ నెగిటివ్ ప్రచారం మొదలైంది. సలార్ పెద్ద హిట్ అయినా కూడా సినిమా ఫ్లాప్ అయింది అని నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. టీవీ ప్రీమియర్ లో సలార్ కి తక్కువ టీఆర్పీ వచ్చింది, ఓటీటీలో కూడా నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది అనే వార్తలు.. వాళ్ళు చేసిన నెగిటివ్ ప్రచారంలో భాగమే.

సోషల్ మీడియాలో ఒక గ్రూప్ వాళ్ళు ప్రభాస్ ప్రతి సినిమాని కావాలని బాహుబలితో పోల్చి తక్కువ చేసి కామెంట్లు చేస్తున్నారు. కావాలని ప్రభాస్ సినిమాలు, ప్రభాస్ లుక్స్ పై ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఇది కేవలం యాంటీ ఫ్యాన్స్ పని మాత్రమే కాదు అని, కొందరు బాలీవుడ్ వాళ్ళు కూడా ప్రభాస్ మీద ఇలా విష ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి అనే ప్రభాస్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ రేంజ్ హీరో పై ఇలాంటి నెగటివ్ ప్రచారం తప్పు అని ఫ్యాన్స్ వాదిస్తున్నారు. బాలీవుడ్ హీరోలు టాలీవుడ్ హీరోలకి ఇంతటి పేరు రావడం ఓర్చుకోలేకే ఇలా చేస్తున్నారని రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. నిజా నిజాలు తెలియకపోయినా ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.

ఇక సినిమాల పరంగా చూస్తే ప్రభాస్ చేతినిండా బోలెడు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898AD సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో సలార్ 2, మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న స్పిరిట్, హను రాఘవపూడి తో మరొక సినిమా లైన్ లో ఉన్నాయి.

Read More: WomanThrows Son: పసిబిడ్డను మొసళ్లకు ఆహరంగా వేసిన కసాయి తల్లి..కారణం ఏంటో తెలుసా..?

Read More: Fake Rape Case: అత్యాచారం చేశాడని ఊరికే చెప్పా.. యువతికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కోర్టు..స్టోరీ ఏంటంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-05-07T15:55:42Z dg43tfdfdgfd