PRABHAS: సలార్2 విజయం సాధ్యమేనా? ఈ అనుమానం వెనుక కారణం ఇదే

Prabhas Salaar 2 : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ లో విడుదలైన సలార్ సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. కాగా ఇప్పుడు ఈ సినిమా అసలు విజయం సాధిస్తుందని కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ అనుమానాలకు చాలా కారణాలు ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు.

అప్పటికే సాహో, రాధే శ్యామ్ వంటి ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న ప్రభాస్ కి.. ఈ మధ్య విడుదలైన సలార్ సినిమా కలెక్షన్లు ఊరట ఇచ్చాయి. కానీ అలా అని, సినిమా బ్లాక్ బస్టర్ అని కూడా చెప్పలేం. కే జి ఎఫ్, బాహుబలి సినిమాల లాగా ఈ సినిమాకి యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ మాత్రం రాలేదు. 

ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన సలార్ కి అన్ని భాషల నుంచి కేవలం మిక్స్డ్ రెస్పాన్స్ మాత్రమే వచ్చింది. పైగా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరగడంతో సినిమాకి ప్రాఫిట్ లు కూడా అంతగా రాలేదు. నైజాం, యూఎస్ఏ ఏరియాలలో మాత్రమే బ్రేక్ ఈవెన్ పాయింట్ చేరుకున్న సినిమా, చాలా ఏరియాల్లో ఫ్లాప్ సినిమా గానే నడిచింది

అటు ఓటిటిలో విడుదలయ్యాక కూడా సినిమాకి అంత అద్భుతమైన రెస్పాన్స్ ఏమీ రాలేదు. ఆఖరికి టీవీ ప్రీమియర్స్ తో కూడా సినిమా అంత హడావిడి చేయలేదు. మరి అలాంటి సినిమా సీక్వెల్ కి ఎన్నో కోట్ల బడ్జెట్ పెట్టి సీక్వెల్ తీయడం పెద్ద రిస్క్ గానే భావిస్తున్నారు చాలామంది. 

నిజం చెప్పాలి అంటే చాలా వరకు ప్రేక్షకులకి సినిమా సీక్వెల్ కచ్చితంగా చూసి తీరాలి అన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. సలార్ సినిమా ట్విస్ట్ తోనే ఎండ్ అయినప్పటికీ.. అది బాహుబలి సినిమా రేంజ్ లో లేదని చెప్పుకోవచ్చు. కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తే ఈ సినిమా రెండో భాగం కథ కొంచెం సులువుగానే ప్రేక్షకులకు అంచనా వేసే రేంజ్ లోనే ఉంది అనిపిస్తుంది. కాబట్టి సలార్ సినిమా మరి నచ్చిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు రెండో భాగం పైన అంతగా ఇంట్రెస్ట్ చూపివ్వడం లేదు.

మరోవైపు చిత్ర డైరెక్టర్ ప్రశాంత్ నీల్, సినిమాని నిర్మిస్తున్న హోం బలే ఫిలింస్ వారు మాత్రం సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని గట్టి నమ్మకంతో ఉన్నారు.  మొదటి భాగం కంటే ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అని వాళ్ళు నమ్ముతున్నారు. అయితే సలార్ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ బట్టి చూస్తే సలార్ 2 సినిమా రెస్పాన్స్ భారీగా వస్తుందని మాత్రం అనిపించడం లేదు. మరి ప్రభాస్.. సినిమాని ఎంతవరకు హిట్ చేయగలదో చూడాలి.

Read More: UP Teen Collapses: టెన్షన్ పుట్టిస్తున్న ఘటనలు.. హాల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువతి..వైరల్ గా మారిన వీడియో..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

2024-05-06T07:28:08Z dg43tfdfdgfd