PRASANTH VARMA: హనుమాన్‌ జయంతి: జై హనుమాన్‌ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చిన డైరెక్టర్‌ - ప్రశాంత్‌ వర్మ ప్లాన్‌ మామూలుగా లేదుగా‌

Prasanth Varma Shared Jai Hanuman New Poster: 'హనుమాన్‌' సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు ప్రశాంత్‌ వర్మ. సూపర్‌ మ్యాన్‌ జానర్‌కు ఇతిహాసాలు జోడించి విజువల్‌ వండర్‌ చూపించాడు. ప్రశాంత్‌ వర్మ పనితీరు చూసి సాధారణ ఆడియన్సే కాదు సినీ ప్రముఖులు సైతం ఫిదా అయ్యారు.  ఇక హనుమాన్‌కు కొనసాగింపుగా 'జై హనుమాన్‌' తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్‌ పార్ట్‌తో ప్రేక్షకులను స్క్రీన్‌కే కట్టిపడేసిన ప్రశాంత వర్మ.. 'జై హనుమాన్‌'తో ఎలాంటి వండర్‌ క్రియేట్‌ చేయబోతున్నాడా? అంతా అంచనాలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో  జై హనుమాన్‌ అప్‌డేట్స్‌ ఇస్తూ మూవీ మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తున్నాడు.

సెకండ్‌ పార్ట్‌లో హనుమంతుడి శక్తిని పరిచయం చేసిన ప్రశాంత్‌.. ఇందులో ఎవరికి తెలియని కొత్త పాయింట్‌ రైజ్‌ చేశాడు. ఎండింగ్‌ హనుమంతుడి దగ్గర శ్రీరాముడు తీసుకున్న మాట ఏమిటో సస్పెన్స్‌లో.. అదే పాయింట్‌పై 'జై హనుమాన్‌' రూపొందించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్‌ వర్క్‌, ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తవగా.. త్వరలోనే సెట్స్‌పైకి తీసుకురాబోతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల శ్రీరామ నవమి సందర్భంగా హనుమంతుడు, శ్రీరాముడి చేతిలో చేయి వేసి మాట ఇచ్చిన పోస్టర్‌ను విడుదల చేసి ఆసక్తిని పెంచాడు. ఇప్పుడు హనుమాన్‌ జయంతి సందర్భంగా అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చాడు. ఈ పోస్టర్‌ చూస్తుంటే ప్రశాంత్‌ వర్మ ఈసారీ భారీ ప్లాన్‌ చేశాడనిపిస్తోంది. హాలీవుడ్‌ రేంజ్‌లో 'జై హానుమాన్‌' తెరకెక్కించబోతున్నాడా? అనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి 'జై హనుమాన్‌' ఐమ్యాక్స్‌ 3డీ ఫార్మాట్‌లోన విడుదల చేయనున్నట్టు అప్పుడే ప్రకటించాడు.

అంతేకాదు అతడి సినిమాటిక్‌ యూనివర్స్‌లో వచ్చే ప్రతి సినిమాను కూడా 3డీ ఫార్మాట్‌లోనే తీసుకురాబోతున్నట్టు ఈ పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన కొత్త పోస్టర్‌ ఆసక్తిని పెంచుతుంది. ఆకాశంలో డ్రాగన్‌ నిప్పులు కక్కుతూ ఉండగా.. దాని ఎదురుగా హనుమంతుడు నిలబడి కనిపించాడు. ఈ ఒక్క పోస్టర్‌తో సినిమా ఎలా ఉండబోతుందా? హింట్‌ ఇచ్చేశాడు ప్రశాంత్‌ వర్మ. ఇంతవరకు ఇలాంటి కాన్సెప్ట్‌ మన తెలుగు సినిమాలో రానేలేదని చెప్పాలి. అసలు డ్రాగన్‌లా కాన్పెప్ట్‌ అనేది హాలీవుడ్‌, చైనా సినిమాల్లో తప్పితే తెలుగు సినిమాల్లో ఇంతవరకు కనిపించలేదు. తొలిసారి డ్రాగన్‌లను ప్రశాంత్‌ వర్మ మన తెలుగువారి చూపించబోతున్నాడని అర్థమైపోతుంది. మొత్తానికి హనుమాన్‌ జయంతి సందర్భంగా జై హనుమాన్‌పై అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చాడంటున్నారు మూవీ లవర్స్‌. ఇక మున్ముందు ప్రశాంత్‌ వర్మ ప్రేక్షకులను ఎలా సర్‌ప్రైజ్‌ చేయబోతాడో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కార్యక్రమాలతో బీజీగా ఉన్నారు. 

2024-04-23T12:31:06Z dg43tfdfdgfd