PRINCIPAL FACIAL IN CLASSROOM: స్కూల్ లో అమ్మాయిలతో ఫెషియల్ చేయించుకున్న ప్రిన్స్ పాల్.. వైరల్ వీడియో..

Uttar Pradesh Unnao School Principle Facial In Class Room: బడిలో విద్యాబుధ్దులు నేర్పించాల్సిన కొందరు ఉపాధ్యాయులు పాడుపనులు చేస్తుంటారు. పవిత్రమైన తమ వృత్తికి చెడ్డపేరు వచ్చేలా ప్రవర్తిస్తుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చక్కగా చదువులు నేర్పిస్తారని, జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎలా వెళ్లాలో చక్కటి మార్గం చూపిస్తారని పాఠశాలల్లో చేర్పిస్తుంటారు. కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి పాఠాలు నేర్పిస్తుంటారు. అన్నిరంగాలలో మంచి పేరుతీసుకొచ్చేలా తీర్చి దిద్దుతారు. విద్యార్థి ఏరంగంలో మంచి గుర్తింపు వచ్చిందో అదే రంగంలో మంచిగా పేరు సంపాదించేలా ఎంకరేజ్ చేస్తారు. కానీ కొందరు ఉపాధ్యాయులు మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటారు.

 

స్యూల్ లో పాఠాలు చెప్పాడనికి బదులు తాగడం, విద్యార్థులను వేధించడం చేస్తుంటారు. ప్రభుత్వ కొలువులో ఉంటూ లక్షల్లో శాలరీలు తీసుకుంటూ.. స్కూల్ లో చదువు చెప్పకుండా, పడుకొవడం, తాగి స్కూల్ కు రావడం,  విద్యార్థులను కొట్టడం వంటివి చేస్తుంటారు. ఇదిలా ఉండగా.. కొన్నిసార్లు ఉపాధ్యాయులు క్లాసుకు వచ్చి  తూలుతు పడిపోయిన సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా..విద్యార్థినులతో పనులు చేయించుకొవడం,తమ ఇంటి పనులు కోసం ఉపయోగించుకొవడం వంటి సంఘటనలు కూడా అనేకం జరిగాయి. తాజాగా, యూపీలో ఒక ప్రిన్స్ పాల్ విద్యార్థినులతో తరగతిలోనే ఫెస్ ప్యాక్ వేయించుకుంది. ఈ ఘటన ప్రస్తుతం తీవ్రదుమారంగా మారింది.

పూర్తి వివరాలు..

ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నావ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎల్‌పి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతా సింగ్ క్లాసులో తన విద్యార్థినులతో ఫెషియల్ చేయించుకుంది. క్లాసులు చెప్పాల్సిన  సమయంలో పాఠశాలలోని ఒక గదిలో ఫేషియల్ చేయడంలో బిజీగా మారిపోయింది. ఇదంతా గమనించిన.. తోటి టీచర్ తన వీడియోను చిత్రీకరించడంతో, సంగీత ఆమెపై దాడిచేసింది. అంతేకాకుండా.. గట్టిగా పట్టుకుని పళ్లతో కొరికింది. ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర దుమారంగా మారింది. దీంతో బాధితురాలు ఉన్నతాధికారులకు సదరు ప్రిన్స్ పాల్ ఘనకార్యం గురించి ఫిర్యాదు చేసింది.

Read More: Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?

అంతేకాకుండా..తనపై హత్యయత్నంకు పాల్పడింటూ బాధితురాలు లోకల్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు కేసునమోదు చేశారు. అంతేకాకుండా.. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై విద్యాశాఖ విచారణ ప్రారంభించింనట్లు సమాచారం. తమతో ప్రిన్స్ పాల్ అన్ని పనులు చేయిస్తుందని,చేయకపోతే బెదిరించేదని విద్యార్థులు కూడా ఆవేదనతో చెప్తున్నట్లు సమాచారం. 

   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

2024-04-19T10:43:27Z dg43tfdfdgfd