RACHITA RAM | దర్శన్‌ నాకు గురువు లాంటి వారు కానీ.. నటి రచితా రామ్‌ ఏమన్నదంటే..?

Rachita Ram | పాపులర్ కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్‌ (Darshan)ను కర్ణాటక పోలీసులు అరెస్ట్‌ చేయడం కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తి హత్యకు సంబంధించిన కేసులో దర్శన్‌తోపాటు నటి పవిత్రగౌడను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నటి రచితా రామ్‌  (Rachita Ram) ఈ వ్యవహారంపై స్పందించింది.

సాధారణ పౌరురాలిగా తన స్పందనను అందరితో పంచుకుంది. రేణుకాస్వామి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని అందించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. హత్య కేసులో సరైన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానంది. దర్శన్‌ గురించి మాట్లాడుతూ.. తనను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దర్శన్‌ తనకు గురువు లాంటి వారని చెప్పింది.

దర్శన్‌ తనకు ఎప్పుడూ పాజిటివ్‌గా మార్గనిర్దేశం చేసేవారని, ఆయన ఇలాంటి హత్య కేసులో ఉన్నారంటే నమ్మశక్యం కావడం లేదంది రచితా రామ్‌. పోలీసుల విచారణలో నిజానిజాలు బయటకు వస్తాయని, మీడియా ఈ కేసును ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా రిపోర్టు చేస్తుందని నమ్ముతున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది రచితా రామ్‌. ఈ కేసులో మొత్తం 17 మంది నిందితులుండగా.. కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

2024-06-18T13:12:39Z dg43tfdfdgfd