RAM CHARAN: 500లకు పైగా కుటుంబాలకు మెగా హీరో సాయం.. ఇది కదా సెన్సేషనల్ న్యూస్ అంటే!

రీల్ హీరోలు రియల్ హీరోగా మారీ కష్టం వచ్చినప్పుడు చాలా మందికి అండగా ఉండటం మనం తరచూ చూస్తూనే ఉంటాయి. ఈ విషయంలో మెగా హీరో రామ్ చరణ్ ఒక మెతుకు ఎక్కువే తిన్నాడు. కష్టం అని తెలిస్తే చాలు.. నేనున్నా అంటూ అడ్డు నిలబడిపోతుంటాడు. మెగాస్టార్ తనయుడైనా కానీ.. ఎక్కడా ఆ గర్వం కనిపించదు. తాను కూడా ఒక సాధారణ వ్యక్తినే అనేలా బిహేవ్ చేస్తుంటాడు. అసలు హీరో అంటే ఇంత సింపుల్‌గా ఉంటాడా అనేలా రామ్ చరణ్ పనులు కనిపిస్తుంటాయి.

ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ చేసిన సహాయాన్ని జానీ మాస్టర్ రీసెంట్‌గా వెళ్లడించాడు. వంద, రెండొందలు కాదు.. ఏకంగా 500లకు పైగా కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ అందేలా చేసి తన మంచితనాన్ని చాటుకున్నాడు. ఇదే విషయాన్ని జానీ మాస్టర్ ఓ నోట్ రూపంలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

'సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు. నా పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ అన్న ఇంటికి పిలిచినపుడు వారికి నా మీదున్న ప్రేమకి చాలా సంతోషపడ్డా. అక్కడికి వెళ్ళాక మెగాస్టార్ చిరజీవి గారి ఆశీర్వాదం తో పాటు చరణ్ అన్న ఉపాసన కొణిదెల వదిన నాకు ఇచ్చిన మాటకి నా సంతోషం 1000 రెట్లు పెరిగింది. నేను ఇదివరకు అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని మా డ్యాన్సర్స్ యునియన్ టి.ఎఫ్.టి.టి.డి.ఎ లో 500+ కుటుంబాలకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అందేలా వారు అండగా నిలబడతామన్నారు.

అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని, ఇచ్చిన మాటకి విలువనిస్తూ, అన్ని కుటుంబాలని చేరదీయడం మామూలు విషయం కాదు. మా అందరి మనసులో కృతజ్ఞత భావం ఎల్లకాలం ఉంటుంది. మా అందరి తరపు నుండి అన్న, వదినలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాను ఊపేస్తుంది.

2024-07-03T11:01:28Z dg43tfdfdgfd