RAM CHARAN,PRABHAS: ఫ్యాన్స్ అంటే మీరేనబ్బా.. చరణ్ పుట్టినరోజున ప్రభాస్ ఫ్యాన్స్ అన్నదానం

Ram Charan,Prabhas: ఫ్యాన్స్ అంటే మీరేనబ్బా.. చరణ్ పుట్టినరోజున ప్రభాస్ ఫ్యాన్స్ అన్నదానం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ గొప్ప మనసు చాటుకున్నారు. మర్చి 27న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా డార్లింగ్ ఫ్యాన్స్ తరుపున ప్రియమైన చరణ్ కోసం అంటూ.. అనాధ పిల్లలకు ఫుడ్ పంపిణీ చేశారు. ఆ ఫుడ్ బాక్స్ లపై ప్రభాస్, రామ్ చరణ్ కలిసి ఉన్న ఫోటోలను అతికించి.. హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవగా.. వాటిపై అందరి హీరోల ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. 

ఫ్యాన్స్ అంటే మీరబ్బా.. అందరు మీలా ఉంటే ఈ ఫ్యాన్ వార్స్ ఎందుకు జరుగుతాయి. ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోల ఫ్యాన్స్ ఇలా కలిసి ముందుకు వచ్చి, మంచి మంచి సేవ కార్యక్రామాలు చేస్తూ ముందుకు సాగితే.. ఇండస్ట్రీ అంత ఆనందంగా ఉంటుంది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ సైతం ప్రభాస్ ఫ్యాన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మన హీరోలే కాదు మనం కూడా ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ ప్రెజెంట్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో కల్కి 2898 ఏడీ సినిమా చేస్తున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

©️ VIL Media Pvt Ltd.

2024-03-28T12:26:50Z dg43tfdfdgfd