మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్‌తో 'గేమ్ ఛేంజర్' సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి లీకుల బెడద మాత్రం తప్పట్లేదు. గతంలో ఏకంగా సినిమాలో సాంగ్యే లీకైపోయిన సంగతి తెలిసిందే. దీనిపై నిర్మాత దిల్ రాజు సైబర్ కంప్లెయింట్ కూడా ఇచ్చారు. తాజాగా మరోసారి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఏకంగా సినిమాలో ఓ కీలక సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
శ్రీకాంత్‌తో కలిసిప్రస్తుతం వైరల్ అవుతోన్న ఈ 16 సెకన్ల వీడియోలో రామ్ చరణ్ పంచెలో కనిపించారు. స్టేజ్ మీద ఉన్న శ్రీకాంత్‌ను ఆప్యాయంగా హగ్ చేసుకొని ఆయన చేతిని పైకెత్తి జనాలకి అభివాదం చేస్తున్నట్లుగా ఈ సన్నివేశం ఉంది. ఇందులో రామ్ చరణ్ లుక్ అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ సన్నివేశాన్ని సరిగ్గా గమనిస్తే ఇదేదో పొలిటికల్ మీటింగ్ సీన్లా ఉంది. ఇక శ్రీకాంత్ నాయకత్వాన్ని బలపరుస్తూ చరణ్ ఇలా చేసి ఉంటారని అంటున్నారు. ఈ చిత్రంలో చరణ్ పొలిటికల్ లీడర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సన్నివేశం వైరల్ అవుతుండటంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
అసలు ఇలా సీన్లకి సీన్లే లీకైపోతే ఎలా.. దీనిపై యాక్షన్ తీసుకోవాల్సిందే అంటూ కోరుతున్నారు. మరి నిర్మాత దిల్ రాజు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. గతంలో ఈ పొలిటికల్ సీన్ కాస్త దూరం నుంచి ఎవరో మొబైల్లో రికార్డ్ చేసిన ఫుటేజి కూడా వైరల్ అయింది. ఇప్పుడు ఏకంగా చాలా దగ్గరి నుంచి దీన్ని రికార్డ్ చేసినట్లుగా వీడియో చూస్తే అర్థమవుతుంది.
చివరి దశలో
ఇక గేమ్ ఛేంజర్ సినిమా రెండు రోజుల షూటింగ్ కోసం చరణ్ ఇటీవల చెన్నైకి వెళ్లి వచ్చారు. ప్రస్తుతం సినిమా చివరి దశ షూటింగ్ నడుస్తుందని టాక్. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ 2021లో లాంఛ్ అయింది. అప్పటి నుంచి ఈ సినిమాను శంకర్ చెక్కుతూనే ఉన్నాడు. దాదాపు మూడేళ్లు గడిచిపోయినా ఇప్పటికీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించలేదు. దీంతో సినిమా అప్డేట్ గురించి ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ దిల్ రాజు మాత్రం ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో చిత్రాన్ని రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. శ్రీకాంత్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర, సముద్రఖని వంటి టాప్ స్టార్లు ఇతర ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి. 2024-05-06T02:54:48Z dg43tfdfdgfd