RAM CHARAN: బాబాయ్ కోసం అబ్బాయ్... పిఠాపురంకు రామ్ చరణ్.. !

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. మరో మూడు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. దీంతో దీంతో అన్ని పార్టీలు ప్రచారంలో బిజీగా మారాయి. గెలుపు కోసం చెమటోడ్చుతున్నాయి. అయితే ఈ సారి ఎన్నికల్లో అందరి చూపు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం వైపే ఉంది. ఎందుకంటే పవన్ ఇక్కడ పోటీ చేయడమే ఇందుకు కారణం. ఈసారి ఎన్నికల్లో పవన్ పిఠాపురం నుంచి గెలుస్తారా అని.. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ విషయం కాస్త పక్కన పెడితే.. ఇప్పుడు పవన్‌కు మద్దతుగా సినీ నటులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు పవర్ స్టార్ కోసం పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు. ఇక ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంతు.. బాబాయ్ కోసం అబ్బాయ్ పిఠాపురం వెళ్తున్నాడట. దీంతో అందరి చూపు మరోసారి పిఠాపురం నియోజకవర్గంపై పడింది.

అయితే రామ్ చరణ్ పిఠాపురం వెళ్తున్నాడని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన తల్లి సురేఖ‌తో కలిసి... పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి చరణ్ వెళ్తున్నాడని సమాచారం. అయితే అంతదూరం వెళ్లిన రామ్ చరణ్.. పవన్ కోసం ప్రచారం కూడా నిర్వహిస్తాడని రాజకీయ వర్గాల టాక్. అయితే చిరంజీవి కూడా పిఠాపురంలో పవన్ కోసం ప్రచారం చేస్తారని వార్తలు వైరల్ అయ్యాయి కానీ అలాంటిదేమి జరగలేదు. కేవలం మెగాస్టార్ .. తన తమ్ముడి కోసం ఓ వీడియో మాత్రమే రికార్డ్ చేసి రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్‌ను గెలిపించాలంటూ.. పిఠాపురం ప్రజల్ని అభ్యర్థిస్తూ.. ఓ వీడియో వదిలారు.

మరోవైపు మెగా హీరోలైన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి వారు రోడ్ల మీదకు వచ్చి పవన్ కోసం ప్రచారాలు చేశారు. మరి రామ్ చరణ్ కూడా పిఠాపురంలో ప్రచారం చేస్తారా? లేదంటే... తన బాబయ్ గెలుపు కోసం కేవలం ఆలయంలో పూజలు చేసి వెనుతిరుగుతారా? మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏమైనా మాట్లాడుతారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఏపీ ఎన్నికలకురెండు రోజుల ముందు రామ్ చరణ్ పిఠాపురం పర్యటన అంతటా ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈసారి ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని రాజకీయ నాయకులు విశ్లేషణలు చేస్తున్నారు.

2024-05-10T15:41:34Z dg43tfdfdgfd